MyGovIndia డేటా ప్రకారం భారత్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. దాదాపు 46 శాతం వాటాతో ఈ రంగంలో ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. భారత్ తర్వాత 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో నిలిచింది.
డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం దూసుకుపోతోంది. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని రీతిలో భారత్ ఈ విషయంలో అద్భుత పనితీరును కనబరుస్తున్నట్లు అనేక సర్వేలు చెబుతున్నాయి. MyGovIndia డేటా ప్రకారం.. 2022లో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో నాలుగుదేశాలను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపుల విషయంలో భారత్ దాదాపు 46 శాతం వాటాను కలిగి వుందని.. తద్వారా డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇండియా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తోంది.
Hey, guess what! We ourselves couldn’t fathom the enormity of the number! It is not in millions, but BILLIONS!
India continues to dominate the digital payments space! pic.twitter.com/XLItsRenSF
భారత్ తర్వాత 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో వుండగా.. 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో .. థాయిలాండ్ 16.5 మిలియన్ల లావాదేవీలతో నాల్గవ స్థానంలో, దక్షిణ కొరియా 8 మిలియన్ల లావాదేవీలతో ఐదవ స్థానంలో నిలిచింది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశ నాయకత్వాన్ని, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై పరివర్తన ప్రభావాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పలుమార్లు హైలైట్ చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుందని.. మొబైల్ డేటా అత్యంత చౌకగా లభించే దేశాల్లో భారత్ ఒకటని మోడీ తెలిపారు. నేడు మనదేశంలో గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ఆయన పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం భారత డిజిటల్ చెల్లింపుల రంగం విలువ, పరిమాణం రెండింటిలోనూ గణనీయమైన మైలురాళ్లను సాధిస్తోంది.
ప్రస్తుతం.. భారతీయ కుటుంబాలు తమ ఆర్థిక లావాదేవీలలో ప్రస్తుతం 35 శాతం డిజిటల్ రూపంలో చెల్లిస్తున్నాయి. అయితే ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) నాటికి 50 శాతం దాటుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పే-టు-మర్చంట్ చెల్లింపులు (P2M) డిజిటల్ లావాదేవీలలో ముఖ్యమైన భాగంగా ఉంది. 80 శాతం భారతీయ కుటుంబాలు కిరాణా, ఆహార పంపిణీ, ప్రయాణ లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులను ఉపయోగిస్తున్నాయి.
రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్, పైన్ ల్యాబ్ సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో కరోనా మహమ్మారి సమయంలో మొదటిసారిగా ఇ-కామర్స్ వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల స్వీకరణను వేగవంతం చేశారని పేర్కొంది. భారతీయ ఇ-కామర్స్ మార్కెట్ విలువ రూ.4,00,000 కోట్లుగా ఉంది. అలాగే FY2026 నాటికి రూ.9,00,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ వృద్ధిలో ఎక్కువ భాగం టైర్-2 , చిన్న నగరాల్లోని కస్టమర్ల నుండి లభిస్తోంది.
కాగా .. చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు మార్కెట్‌లో అత్యధిక వాటాను ఆక్రమించాయి. FY23 నాటికి మొత్తం డిజిటల్ చెల్లింపు పరిమాణంలో 84 శాతం. వివిధ బిల్లు చెల్లింపులను సులభతరం చేసే భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థ, FY2023, FY2026 మధ్య దాదాపు 30 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)ని కలిగి ఉంటుందని , 110 కోట్ల లావాదేవీల నుండి 240 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసింది. .