ఎస్బీఐ నుండి ఐసీఐసీఐ వరకు.. ఎటిఎంలు ఎంత ఛార్జ్ చేస్తాయో తెలుసా?

By Ashok kumar Sandra  |  First Published Dec 14, 2023, 12:14 PM IST

భారతదేశంలోని అన్ని బ్యాంకులు కస్టమర్లకు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో ఉచిత ATM లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ పరిమితిని ఒక నెలలోపు దాటితే వినియోగదారులు ప్రతి ఏటీఎం లావాదేవీకి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
 


ఇప్పుడు SBI, PNB, HDFC అండ్ ICICI బ్యాంకుల ATMల నుండి పరిమితికి మించి డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే చార్జెస్ తప్పనిసరి. అయితే దీనిపై చాల మందికి అవగహన  ఉండకపోవచ్చు. కానీ ఏ  బ్యాంక్ ఎటిఎంలు ఎంత ఛార్జ్ చేస్తున్నాయో మీకు తెలుసా...

భారతదేశంలోని అన్ని బ్యాంకులు కస్టమర్లకు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో ఉచిత ATM లావాదేవీలను అందిస్తున్నాయి. ఈ పరిమితిని ఒక నెలలోపు దాటితే వినియోగదారులు ప్రతి ఏటీఎం లావాదేవీకి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

Latest Videos

undefined

తాజా RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు ఉచిత లావాదేవీల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి విత్ డ్రాకి గరిష్టంగా రూ. 21 వసూలు చేయవచ్చు. ఏయే బ్యాంకులు నెలలో ఎన్ని లావాదేవీలకు ఎంత పరిమితిని అందిస్తున్నాయి, ఆ తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి.

చాలా బ్యాంకులు వినియోగదారులకు ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలను అందిస్తాయి. దీనిని ఉపయోగించకుంటే ఒకోసారి ఈ పరిమితి వచ్చే నెల వరకు సరిపోదు. దేశంలోని కొన్ని ప్రధాన బ్యాంకుల నియమాల గురించి తెలుసుకుందాం...

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ATM (PNB) మెట్రో అండ్ నాన్-మెట్రో ప్రాంతాల్లోని ATMలలో ప్రతి నెలా 5 ఉచిత లావాదేవీలను అనుమతిస్తుంది. దీని తర్వాత వినియోగదారులు ప్రతి లావాదేవీకి రూ.10 చెల్లించాలి. PNB నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలపై రూ. 9తో పాటు పన్నులు వసూలు చేస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ATMలలో 5 ఉచిత లావాదేవీలను (నాన్-ఫైనాన్షియల్ అండ్ ఫైనాన్షియల్‌తో సహా) అందిస్తుంది. పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీలకు ఎస్‌బిఐ ఎటిఎంలలో జిఎస్‌టితో పాటు రూ.10 ఛార్జీ విధించబడుతుంది. ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఒక్కో లావాదేవీకి రూ. 20తో పాటు జీఎస్టీ వసూలు చేస్తారు.

ICICI బ్యాంక్ కస్టమర్లకు ప్రతి నెలా మెట్రో ప్రాంతాల్లో 3 ఉచిత లావాదేవీలు అండ్  నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలను అనుమతిస్తుంది. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎంలు ప్రతి నాన్ ఫైనాన్సియల్ లావాదేవీకి రూ.8.5 అండ్  ప్రతి ఫైనాన్సియల్ లావాదేవీకి రూ.21 వసూలు చేస్తాయి.

HDFC బ్యాంక్ ATMలలో ప్రతి నెల 5 ఉచిత లావాదేవీల లిమిట్ ఉంది. నాన్-బ్యాంకు ATMలకు మెట్రో ప్రాంతాల్లో 3 లావాదేవీలు అండ్ నాన్-మెట్రో ప్రాంతాల్లో 5 లావాదేవీలు ఉంటాయి. 

click me!