పెట్రోల్ బంక్ నుండి ప్రతినెల లక్షలు సంపాదించొచ్చు.. ఎలాగో తెలుసా..?

By Ashok kumar Sandra  |  First Published Apr 5, 2024, 5:31 PM IST

భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఇది ఒక బలమైన ఇన్ కం సోర్సెస్  కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఏ విధమైన డీలర్‌షిప్  ఉంటుందో కూడా తెలియదు... 
 


 భారతదేశంలోని చాలా మంది ప్రజలు వ్యాపారంలో వారి  చేతి అదృష్టాన్ని ప్రయత్నించాలని కోరుకుంటారు. ముఖ్యంగా చూస్తే సొంతంగా  పెట్రోల్ పంప్   ఉండాలని కోరుకుంటారు. ఇది కూడా మంచి  ఛాయిస్. భారతదేశంలో పెట్రోల్ డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఫిబ్రవరిలో పెట్రోలు వినియోగం 19.72 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇది  ఒక బలమైన ఆదాయ సోర్సెస్  కావచ్చు. అయితే పెట్రోల్ పంపు తెరవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఏ విధమైన డీలర్‌షిప్  ఉంటుంది ? పెట్రోల్ బంక్ తెరవడానికి ఏమి చేయాలో తెలుసా... మరి ఈ వ్యాపారంలో ఎంత లాభం ఉంటుంది అని ఆలోచిస్తున్నారా... 

 ఎంత పెట్టుబడి పెట్టాలి?

Latest Videos

గ్రామీణ ప్రాంతంలో పెట్రోల్ పంపు తెరవాలంటే రూ.12 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాగే  పట్టణ ప్రాంతాలలో రూ.20 నుంచి 25 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

ఈ వ్యాపారంలో ఎంత లాభం

పెట్రోలు వ్యాపారంలో ఎంత ఎక్కువ అమ్మితే అంత లాభం అన్నది జరుగుతుంది. వాస్తవానికి పెట్రోల్ అమ్మకంపై లీటరుకు రూ.2 నుంచి 5 వరకు కమీషన్ లభిస్తుంది. నెలకు దాదాపు రూ.2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం రావచ్చని అంచనా.  

ఎంత భూమి అవసరం అవుతుంది

పెట్రోల్ పంపును తెరవాలంటే దాదాపు 800 నుంచి 2000 చదరపు మీటర్ల స్థలం ఉండాలి. మీకు భూమి లేకపోతే, మీరు భూమిని లీజుకు కూడా తీసుకోవచ్చు.

డీలర్‌షిప్ ఎలా పొందాలో తెలుసుకోండి

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం లేదా హిందుస్థాన్ పెట్రోలియం కోసం మీరు మొదట ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు  www.petrolpumpdealerchayan.in వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు . అందులో అవసరమైన సమాచారం నింపాల్సి ఉంటుంది.  దీని తర్వాత ఈ కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి.

ఈ డాకుమెంట్స్  మీ దగ్గర ఉంచుకోండి

దీని కోసం ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికెట్, భూమి డాకుమెంట్స్  లేదా లీజు పేపర్స్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా  ఇతర ఆమోద పత్రాలు వంటి అవసరమైన డాకుమెంట్స్   అవసరం. అంతే కాకుండా, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను డాకుమెంట్స్   ఇంకా  పర్యావరణ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా అవసరం.

click me!