వచ్చే ఐదేళ్లలో...ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే.. ఎస్‌బి‌ఐ చైర్మన్

By Sandra Ashok KumarFirst Published Feb 7, 2020, 10:19 AM IST
Highlights

ప్రస్తుతం బ్యాంకుల ఔట్ స్టాండింగ్ క్రెడిట్ గ్రోత్ 95 లక్షల కోట్లని, దీన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేస్తే భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ జోస్యం చెప్పారు. అయితే బ్యాంకుల విలీనంలో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సమస్యగా మారనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 
 

న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల వ్యవస్థగా అవతరించాలంటే ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ ఓ సూత్రం చెప్పారు. వచ్చే ఐదేళ్లలో బ్యాంక్ ఔట్ స్టాండింగ్ క్రెడిట్ రెట్టింపు చేయాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం రూ.95 లక్షల కోట్లుగా రికార్డైంది. గురువారం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్టిలో రజనీశ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. '

మరోవైపు యూనియన్ బ్యాంక్ సీఈఓ కం ఎండీ జీ రాజ్ కిరణ్ రాయ్ స్పందిస్తూ ఏటా క్రెడిట్ గ్రోత్ సగటున 15 శాతం పెంచాలని సూచించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీన ప్రక్రియలో రానున్న రోజుల్లో భారీ సవాళ్లు ఎదుర్కోనున్నాయని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) చైర్మెన్‌ రజనీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పది బ్యాంకులను విలీనం చేస్తూ గతేడాది ఆగస్టులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

also read పన్ను శ్లాబ్‌ల్లో క్లారిటీ కోసం ఐటీ వెబ్‌సైట్‌లో ఈ-కాలిక్యులేటర్‌

ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ సవాల్‌ను ఎదుర్కోనున్నాయని చెప్పారు. ప్రస్తుతం బ్యాంకులు విలీనం ప్రక్రియ మధ్యలో ఉన్నాయని రజనీశ్ కుమార్ తెలిపారు. విలీన ప్రక్రియలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇంటిగ్రేషనే అసలు సమస్య అని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పది బ్యాంకులను విలీనం చేస్తూ ప్రకటించినప్పటి నుంచి ప్రక్రియ వేగవంతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విలీనాల ప్రక్రియ దశల వారీగా ముందుకు సాగుతున్నా.. వివిధ సమస్యలు వచ్చిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్‌ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. 2017 ఏప్రిల్‌లో ఎస్బీఐలో ఐదు అనుబంధ బ్యాంకులు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ విలీనమయ్యాయి. 

also read బడ్జెట్​లో సంస్కరణలపై కేంద్రం లైట్ తీసుకుంది: ఫిచ్‌

ఈ నేపథ్యంలో ఎదురైన సవాళ్లను గుర్తు చేసుకుంటూ రజనీశ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఎస్‌బీఐ దాని అనుబంధ బ్యాంకుల విలీనం కొలిక్కి వస్తున్న నేపథ్యంలో గతేడాది ఇంకో అడుగు ముందుకేసిన సర్కారు.. పది బ్యాంకులను విలీనం చేసి నాలుగు బ్యాంకులుగా చేయాలని నిర్ణయించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం కానున్నాయి.

కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులు నాలుగు బ్యాంకులుగా విలీనం కానున్నాయి.బ్యాంకుల విలీన ప్రభావంతో ఉన్న ఉద్యోగాలు ఊడటంతో పాటుగా ఉపాధి కల్పన పడిపోయే ప్రమాదం ఉందన్న విమర్శలు వినవస్తున్న సంగతి తెలిసిందే. 2017లో మొదలైన బ్యాంకుల విలీనంతో దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12 బ్యాంకులకు చేరుకున్నది.
 

click me!