Latest Videos

Second Hand Phones: సెకండ్ హ్యాండ్ ఫోన్‌ కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే అంతే!

By Rajesh KarampooriFirst Published May 22, 2024, 5:43 PM IST
Highlights

Second Hand Phones: ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్లు భాగమయ్యాయి. కొత్త ఫోన్ కొనలేని వారు చాలామంది పాత సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అయితే..   సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే.. భారీ నష్టపోవాల్సి ఉంటుంది.  

Second Hand Phones: నేటి కాలంలో ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువయిపోంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఫోన్లు ఓ భాగమయ్యాయి. ఇదిలా ఉంటే పాతకాలం నాటి ఫోన్లు వాడేవారికి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. కొత్త ఫోన్ కొనలేని పరిస్థితిలో ఉన్నవారు, కొత్త ఫోన్ ధర ఎక్కువగా ఉంటుంది అనుకునేవారు.

చాలామంది పాత సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. వారికి స్మార్ట్ ఫోన్ పై అవగాహన లేకపోయినా ఏదో ఒక ఫోన్ కొనుగోలు చేసి వాడేస్తుంటారు. దాంతో కొన్నిసార్లు ఇబ్బుందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే సెకండ్ హ్యాండ్ ఫోన్‌ను తీసుకునే ముందు ఏలా వాటిని పరిశీలించాలో కొన్ని టిప్స్ కనుక్కుందాం. 

ముందుగా ఒక ఫోన్ కొనేముందు దానిపై గీతలు ఉన్నాయా లేదా చెక్ చేసి గీతలు లేని ఫోన్ చూసుకోవాలి. అలాగే ఫోన్ స్క్రీన్‌పై పగుళ్లు ఉన్నవి, లేనివి చెక్ చేయాలి అలాగే  చార్జింగ్ పోర్ట్, కీ ప్యాడ్, టచ్, ఎంత ఫాస్ట్ ఉందో చూసుకోవాలి. అంతే కాదు ఆ ఫోన్ ఎంత పాతది, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు, ఎప్పుడు లాంచ్ అయ్యిందో చెక్ చేయాలి. అలాగే బ్యాటరీ లైఫ్, ఎంత సమయం బ్యాటరీ పనిచేస్తుంది అన్న విషయం కూడా పరీక్షించాలి.

వీటితో పాటు మీ స్మార్ట్ ఫోన్ కొత్త అప్‌డేట్‌లకు సపోర్ట్ చేస్తుందా చెక్ చేయాలి.  అలాగే నెట్‌వర్క్ ప్రొవైడర్‌ అన్‌లాక్ చేసి ఉందో లేదో పరిశీలించాలి. ఒక వేల నెట్‌వర్క్ ప్రొవైడర్ అన్ లాక్ చేయకపోతే కేవలం ఒకే నెట్‌వర్క్ సిమ్‌ను మాత్రమే మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కెమెరా నాణ్యత, ఇంటర్నెట్‌ని బ్రౌజ్,  ఫోన్‌లో యాప్‌లను రన్ చేసి చూడండి. అలాగే ఫోన్ హ్యాంగ్ అవుతుందా చెక్ చేయాలి.

ఇవన్నీ చెక్ చేసుకున్నాడే ముందడుగు వేసి డీల్‌ను ఫిక్స్ చేసుకోవాలి. అలాగే కొత్త వ్యక్తుల నుంచి, కొన్ని వెబ్ సైట్లలో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనుగోలు చేయవద్దు. ఒక వేళ వాటి ధర అధికంగా అనిపిస్తే ఆ ధరలో వచ్చే కొత్త ఫోన్లను తీసుకోవడం ఉత్తమం.

click me!