Budget 2024 : రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుందా? వ్యవసాయ రుణ లక్ష్యం రూ. 22-25 లక్షల కోట్లకు పెరుగుతుందా?

By SumaBala BukkaFirst Published Jan 23, 2024, 2:44 PM IST
Highlights

ప్రస్తుతం, రైతులు సంవత్సరానికి 7 శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణం పొందుతున్నారు. ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. 

బడ్జెట్ అంచనాలు : వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 22-25 లక్షల కోట్లకు గణనీయంగా పెంచడంతోపాటు, అర్హులైన ప్రతి రైతుకు సంస్థాగత రుణాలు అందేలా చూడాలని ప్రభుత్వం రాబోయే మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.

ప్రస్తుతం, ప్రభుత్వం అన్ని ఆర్థిక సంస్థలకు రూ. 3 లక్షల వరకు స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై రెండు శాతం వడ్డీ రాయితీని అందిస్తుంది. అంటే రైతులు సంవత్సరానికి 7 శాతం రాయితీపై రూ.3 లక్షల వరకు వ్యవసాయ రుణం పొందుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు సంవత్సరానికి 3 శాతం అదనపు వడ్డీ రాయితీ కూడా అందించబడుతుంది. రైతులు దీర్ఘకాలిక రుణాలను కూడా పొందవచ్చు. కానీ, వడ్డీ రేటు మార్కెట్ రేటు ప్రకారం ఉంటుంది.

Latest Videos

2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణ లక్ష్యం రూ.22-25 లక్షల కోట్లకు భారీగా పెరగవచ్చని వర్గాలు తెలిపాయి. సమాచారం ప్రకారం, వ్యవసాయ-క్రెడిట్‌పై ఎక్కువ దృష్టి ఉంటుంది. మిగిలిపోయిన అర్హులైన రైతులను గుర్తించి వారిని క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావడానికి ప్రభుత్వం అనేక క్యాంపెయిన్ లను అమలు చేస్తోంది.

Budget Expectations 2024 : 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త ఉండబోతోందా? పన్నురాయితీలు, విరాళాలు వేటిమీదంటే?

వ్యవసాయ మంత్రిత్వ శాఖ కేంద్రీకృత విధానాన్ని అందించడానికి 'క్రెడిట్'పై ప్రత్యేక విభాగాన్ని కూడా సృష్టించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇంకా, వివిధ వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు రుణ పంపిణీ గత 10 సంవత్సరాలలో లక్ష్యాన్ని మించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, డిసెంబరు 2023 వరకు రూ. 20 లక్షల కోట్ల అగ్రి-క్రెడిట్ లక్ష్యంలో దాదాపు 82 శాతం సాధించారు. ఈ కాలంలో ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా దాదాపు రూ. 16.37 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేసినట్టుగా అధికారిక డేటా చెబుతోంది.

“వ్యవసాయ-క్రెడిట్ పంపిణీ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉంది” అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో, మొత్తం వ్యవసాయ రుణ పంపిణీ రూ. 21.55 లక్షల కోట్లుగా ఉంది, అదే కాలానికి నిర్దేశించిన రూ. 18.50 లక్షల కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది.

డేటా ప్రకారం, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) నెట్‌వర్క్ ద్వారా 7.34 కోట్ల మంది రైతులు రుణాన్ని పొందారు. మార్చి 31, 2023 నాటికి దాదాపు రూ. 8.85 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. గ్రామీణ భారతదేశంలోని వ్యవసాయ గృహాలు, గృహాల భూమి, పశువుల హోల్డింగ్‌ల పరిస్థితుల అంచనాపై 2019 ఎన్ఎస్ఎస్ నివేదిక ప్రకారం, దేశంలో రుణగ్రస్తులైన వ్యవసాయ కుటుంబాల శాతం 50.2 శాతం. ఇందులో 69.6 శాతం బకాయి రుణాలు సంస్థాగత వనరుల నుంచి తీసుకున్నవే.

ఎన్‌ఎస్‌ఎస్ నివేదికను పరిశీలిస్తే, సంస్థాగత రుణానికి ప్రాప్యత లేని వ్యవసాయ కుటుంబాల పెద్ద భాగం ఇప్పటికీ ఉందని ఆ వర్గాలు తెలిపాయి. అటువంటి వారిని అధికారిక క్రెడిట్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫలితంగా, ప్రభుత్వం గత మూడు నెలల్లో 'ఘర్ ఘర్ KCC ప్రచారం', 'విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర',  'PM-JANMAN'  అనే గిరిజన సమూహాలు (PVTGs) క్యాంపెయిన్ క్యాంపెయిన్ అనే మూడు విభిన్న కార్యక్రమాల ద్వారా KCCలో 100 శాతం సంతృప్తతను సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మిగిలిపోయిన రైతులు, మత్స్యకారులు, గిరిజన రైతులకు కేసీసీ జారీ చేస్తున్నారు.

click me!