గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో బడా వ్యాపార సంస్థలు సైతం రోడ్డెక్కక తప్పడం లేదు.
బెంగళూరు/కోల్‌కతా: గతంలో ఓ సినిమాలో తోటకూర.. గోంగూర.. పీతలు.. పిత్తపరిగెలూ అంటూ పాట ఉంది.. అలాగే ఇప్పుడు కరోనా పుణ్యమా? అని టీవీలు.. స్మార్ట్‌ఫోన్లు.. బట్టలు..నగలూ అంటూ అన్నీ ఇంటి ముందుకే వచ్చి విక్రయించే రోజులు వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో బడా వ్యాపార సంస్థలు సైతం రోడ్డెక్కక తప్పడం లేదు.
మానవ జీవన విధానాన్నే పూర్తిగా మార్చేసిన కరోనా మహమ్మారి.. మార్కెట్ ముఖచిత్రాన్నీ మార్చేస్తున్నది. ఏది కావాలన్నా దుకాణాల వద్దకే వెళ్లే పరిస్థితులు పోయాయి. ఇకపై అన్ని రకాల వస్తువుల అంగళ్లు మన ఇళ్ల ముందుకు రాబోతున్నాయి.
undefined
కరోనా ఉద్ధృతితో కస్టమర్లుబయటకు వచ్చేందుకు బెంబేలెత్తుతుండటంతో వ్యాపార సంస్థలు తమ సరుకులను వాహనాల్లో నింపి వినియోగదారుల వద్దకే వెళ్లాలని చూస్తున్నాయి.ఇప్పటికే కొన్ని సంస్థలు పలు నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ పద్ధతికి తెర లేపాయి.
త్వరలో మరిన్ని సంస్థలు ఇదే బాట పట్టనున్నాయి. ఈ మేరకు ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అనుమతుల్ని సాధించే పనిలో పడ్డాయి. ఈ పోరులో బడా బ్రాండ్లూ సైసై అంటున్నాయి.
సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీ, తనిష్క్, క్రోమా, లైఫ్‌ైస్టెల్, విజయ్ సేల్స్, గ్రేట్ ఈస్టర్న్ రిటైల్, సంగీతా మొబైల్స్ వంటి ఎన్నో బ్రాండ్లు తమ ఉత్పత్తులతో వాహనాలను నింపి భారీ అపార్టుమెంట్లు, కాలనీల వద్దకు వెళ్లాలని చూస్తున్నాయి.
వైరస్ దెబ్బకు ఇళ్లను వదిలి బయటకు ఎవరూ రాలేని దుస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇప్పటికీ అనేక సంస్థలు, దుకాణాలు వ్యాపారానికి దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కస్టమర్లు మునుపటిలా షాపింగ్‌చేసే అవకాశాలు తక్కువే కనిపిస్తున్నాయి.
దీంతో పలు వ్యాపార సంస్థలు తమ రూట్ మారుస్తున్నాయి. స్థిర నివాసం నుంచి చలనబాట పడుతున్నాయి. అత్యవసరం కాని వస్తు ఉత్పత్తుల విక్రయాలకూ కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ సంస్థలు మారిన మార్కెట్ పరిస్థితులు, వినియోగదారుల ఆలోచనా ధోరణికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ స్టోర్లకు శ్రీకారం చుడుతున్నాయి.
also read:ట్రంప్ నిర్ణయం: 40 వేల మంది వైద్య నిపుణులకు గ్రీన్ కార్డు.. ఇది పక్కా?
తోపుడు బండ్లపై వస్తువులను అమ్ముకునే చిరు వ్యాపారులను ఇప్పుడు బడా వ్యాపారులు అనుసరించబోతున్నారు. వ్యాన్లలో తమ ఉత్పత్తులను పెట్టుకుని భారీ అపార్టుమెంట్లు, కాలనీల్లో మొబైల్ షాపులను తెరువబోతున్నారు. కస్టమర్లు నేరుగా తమకు నచ్చిన వస్తువును ఎంచుకుని కొనుగోలు చేసే అవకాశం ఇక్కడ ఉంటుంది.
‘స్టోర్ ఆన్ వీల్స్ ఆలోచనతో కస్టమర్లు దుకాణాల వద్దకు వెళ్లాల్సిన పనిలేదు’ అని సెంట్రల్, బ్రాండ్ ఫ్యాక్టరీల మాతృ సంస్థ ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ ఎండీ విష్ణు ప్రసాద్ అన్నారు. బెంగళూరులోని ఆరు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి మొబైల్ స్టోర్ల ఏర్పాటుకు అనుమతి పొందామన్నారు. ఇలాగే మరికొన్ని రాష్ర్టాల్లో మొబైల్ స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లోకి రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. మరో ఆరు నెలలు పరిస్థితులు ఇలాగే ఉండొచ్చని, ఆ తర్వాత కూడా కొనసాగే వీల్లేకపోలేదని లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ ఎండీ విష్ణు ప్రసాద్ వ్యాఖ్యానించారు.
టాటా గ్రూప్ బ్రాైండ్లెన తనిష్క్, టైటాన్ సైతం జూన్‌కల్లా పలు నగరాల్లో ఇళ్ల వద్దకే దుకాణాల సూత్రాన్ని అవలంభించనున్నాయి. సంగీతా మొబైల్స్, గ్రేట్ ఈస్టర్న్ రిటైల్ కూడా ఈ దిశగానే నడుస్తున్నాయి.
లాక్‌డౌన్‌తో స్టోర్లను మూసేసిన బడా సంస్థలు.. స్థానిక వ్యాపారులతో కలిసి వినియోగదారులను చేరేందుకు ప్రయత్తిస్తున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు శ్రమించిన కార్పొరేట్ కంపెనీలు.. అమ్మకాల కోసం చోటా రిటైల్ వ్యాపారులతో కలిసి పనిచేస్తున్నాయి.
ముఖ్యంగా టెలివిజన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ తదితర గృహోపకరణాల తయారీ సంస్థలు ఆన్‌లైన్‌లో అందుకున్న ఆర్డర్లను ఆఫ్‌లైన్‌లో డెలివరీ చేస్తున్నాయి. సమీప రిటైల్ ఔట్‌లెట్లలో వస్తూత్పత్తులను తీసుకోవచ్చని ఆఫర్ చేస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల మధ్యే దుకాణాలను మూసేస్తున్నా అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే ఉన్నాయని ప్రముఖ రిటైల్ బ్రాండ్ స్టోర్ క్రోమా తెలిపింది. తమ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కూ 50 శాతానికిపైగా ఆదరణ పెరిగినట్లు చెప్పింది.