Union Budget 2022-23: కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన సవాళ్లు ఇవే..

By Sumanth Kanukula  |  First Published Feb 1, 2022, 11:09 AM IST

కరోనా మహమ్మారితో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ  సమయంలో కేంద్ర బడ్జెట్ 2022-23పై (Union Budget 2022-23) ప్రజలు, వివిధ రంగాల వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రం పరిష్కారించాల్సిన సవాళ్లను ఒక్కసారి చూద్దాం.. 


కరోనా మహమ్మారితో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ.. తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది.  ఈ  సమయంలో కేంద్ర బడ్జెట్ 2022-23పై ప్రజలు, వివిధ రంగాల వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో ర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచే చర్యలను ప్రకటిస్తారని సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అంచనాలు ఉన్నాయి. అయితేసామాన్యులు, రైతులు, మధ్యతరగతి.. ఇలా అన్ని వర్గాల ప్రజలు బడ్జెట్‌లో శుభవార్తలుంటాయని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్రం పరిష్కారించాల్సిన సవాళ్లను ఒక్కసారి చూద్దాం.. 

పెరుగుతున్న ద్రవ్యోల్బణం
కరోనా మహమ్మారి ప్రభావంతో ఉద్యోగాలు, ప్రజల ఆధాయ మార్గాలు దెబ్బతిన్న సమయంలో.. భారతీయ కుటుంబాలు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయి. వీరంతా బడ్జెట్‌పై ఆశాజనకంగా ఉన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో LPG, కిరోసిన్‌పై సబ్సిడీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు, సహజవాయువును జీఎసీటీ పరిధిలోకి చేర్చే అవకాశం లేదని బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ తెలిపింది.

Latest Videos

పెరుగుతున్న నిరుద్యోగం
ఆర్థిక మందగమనం నిరుద్యోగిత రేటును ప్రపంచ స్థాయి కంటే పైకి నెట్టింది. నిరుత్సాహానికి గురైన ఉద్యోగార్ధులు విదేశాలకు వెళ్లాలని చూస్తున్నందున కార్మికుల భాగస్వామ్య రేటు తగ్గడమే పెద్ద సమస్య అని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. 2022 బడ్జెట్‌లో.. ప్రభుత్వం మొదట మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టాలి, ఆ తర్వాత ఉత్పాదక సామర్థ్యాల యొక్క అధిక ప్రోత్సాహక విస్తరణ ద్వారా ఉద్యోగ కల్పనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ASSOCHAM సర్వే పేర్కొంది.

2022 బడ్జెట్ తప్పనిసరిగా ఉపాధి, ఉద్యోగాలను సృష్టించేలా చూడాలి. అయితే.. ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉందని అగ్ర బ్రోకరేజ్ సంస్థ డ్యుయిష్ బ్యాంక్ పేర్కొంది. రాబోయే బడ్జెట్ 2022 వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక వ్యవస్థలో విస్తృతమైన అసమానతలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ డి సుబ్బారావు అన్నారు.

ఆదాయపు పన్ను రిలీఫ్‌లు
కోవిడ్-19 మహమ్మారి  నేపథ్యంలో.. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ. 2.5 లక్షలను పెంచుతుందని, రూ. 10 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ ఆదాయపు శ్లాబ్‌లో ఎగువ సవరణను పెంచుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్షన్ 80సి మినహాయింపు పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచాలని వేతన తరగతి వర్గాలు కోరుతున్నాయి.

ద్రవ్య లోటు
మహమ్మారి సమయంలో 800 మిలియన్ల పేదలకు ఉచిత ఆహారాన్ని అందించడంలో మోడీ ప్రభుత్వం ఎరువులు, ఆహార సబ్సిడీలపై ఖర్చు చేయడంతో భారతదేశ ఆర్థిక లోటు రికార్డు స్థాయిలో 9.3 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీన్ని తిరిగి 6.8 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ప్రభుత్వం క్రమంగా ఆర్థిక ఏకీకరణపై దృష్టి పెట్టాలి. అదే సమయంలో పెట్టుబడి ఆధారిత వృద్ధిని ఎంచుకోవాలి.

ప్రైవేటీకరణ
మైనారిటీ వాటాలను డైవ్ చేయడం , వాటిలో కొన్నింటిని పూర్తిగా ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను సంస్కరిస్తామనే వాగ్దానాలపై ప్రభుత్వం పెద్దగా ముందుకు సాగలేదు. ఏళ్ల తరబడి ప్రయత్నించిన తర్వాత ఎయిర్ ఇండియాను విక్రయించగలిగింద., అయితే కొన్ని బ్యాంకులు, రిఫైనర్‌లు మరియు బీమా సంస్థలను విక్రయిస్తామన్న వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని రాయిటర్స్ నివేదించింది.


 

click me!