ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది..? ఎన్ని ఖర్చులు ఉండొచ్చు..? లెక్కలు వేస్తూ ప్రతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేదే బడ్జెట్. ప్రతి ఏడాది ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది..? ఎన్ని ఖర్చులు ఉండొచ్చు..? లెక్కలు వేస్తూ ప్రతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేదే బడ్జెట్. ప్రతి ఏడాది ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వరుసగా నాలుగో సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Union Budget 2022ను ఫిబ్రవరి 1, 2022న పార్లమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ముందుగా 6 సవాళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా ఉంచే చర్యలను ప్రకటిస్తారని సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అంచనాలు ఉన్నాయి.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
కరోనా మహమ్మారి వలన ఉద్యోగాలు, ఆదాయాలు దెబ్బతిన్న సమయంలో భారతీయులు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నారు. అయితే వచ్చే వారం రానున్న వార్షిక బడ్జెట్ చాలా ఉపశమనం ఇస్తుందని ఆర్థికవేత్తలు ఆశాజనకంగా ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో LPG, కిరోసిన్‌పై సబ్సిడీలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్రోల్ మరియు డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం లేదా సహజవాయువును జిఎస్‌టి కింద చేర్చడం గురించి ఎటువంటి అంచనాలు లేవని ప్రముఖ సంస్థ జెఫరీస్ తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే తక్షణ కర్తవ్యాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుర్కొంటోన్నట్లు HSBC తన ప్రీ-బడ్జెట్ అంచనాలలో పేర్కొంది.
undefined
పెరుగుతున్న నిరుద్యోగం
ఆర్థిక మందగమనం గత ఆరేళ్లలో నిరుద్యోగిత రేటును ప్రపంచ స్థాయి కంటే పైకి నెట్టింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. నిరుత్సాహానికి గురైన నిరుద్యోగులు విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారని తెలిపింది. బడ్జెట్ 2022లో ప్రభుత్వం మొదట మౌలిక సదుపాయాలపై పెట్టుబడులను పెంచడంపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాత ఉత్పాదక సామర్థ్యాల యొక్క అధిక ప్రోత్సాహక విస్తరణ ద్వారా ఉద్యోగ కల్పనను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని ASSOCHAM సర్వే పేర్కొంది. బడ్జెట్ 2022 తప్పనిసరిగా ఉపాధి మరియు ఉద్యోగాలను సృష్టించేలా చూడాలని, అయితే.. ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సంస్థ డ్యుయిష్ బ్యాంక్ పేర్కొంది. రాబోయే బడ్జెట్ 2022 వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడం మరియు ఆర్థిక వ్యవస్థలో విస్తృతమైన అసమానతలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ డి. సుబ్బారావు అన్నారు.
ఆదాయపు పన్ను
పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్నులో మినహాయింపులను ఆశిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వం ప్రాథమిక ఆదాయపు పన్ను రూ. 2.5 లక్షల మినహాయింపు పరిమితిని పెంచుతుందని,రూ. 10 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయపు శ్లాబ్‌లో సవరణను పెంచుతుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సెక్షన్ 80సి మినహాయింపు పరిమితిని రూ. 1.5 లక్షలకు పెంచాలని వేతన వర్గాలు కోరుతున్నాయి.
ఆర్థిక ఉత్పత్తి
భారతదేశ వార్షిక స్థూల జాతీయోత్పత్తి (GDP) 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4 శాతానికి పడిపోయింది. ఆర్థిక ఉత్పత్తిలో రికార్డు పతనాన్ని నమోదు చేయడానికి మహమ్మారి ఆ ఏడాది మరింత సాయపడింది. ఏది ఏమైనప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 7.3 శాతం ఉన్న వృద్ధి రేటు ఈ ఏడాది మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధిని కొనసాగించేందుకు ప్రభుత్వం 2022 బడ్జెట్‌లో చర్యలు తీసుకోవాలి.
ద్రవ్య లోటు
కరోనా మహమ్మారి సమయంలో 800 మిలియన్ల పేదలకు ఉచిత ఆహారాన్ని మోడీ ప్రభుత్వం అందించింది. అలాగే ఎరువులు, ఆహార సబ్సిడీలపై ఖర్చు చేయడంతో భారతదేశ ఆర్థిక లోటు రికార్డు స్థాయిలో 9.3 శాతానికి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీన్ని తిరిగి 6.8 శాతానికి కట్టడి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం క్రమంగా ఆర్థిక ఏకీకరణపై దృష్టి పెట్టి, పెట్టుబడి ఆధారిత వృద్ధిని ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రైవేటీకరణ
మైనార్టీ వాటాలు ఉన్నవాటిని ఉపసంహరించుకోవడం, వాటిలో కొన్నింటిని పూర్తిగా ప్రైవేటీకరించడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలను సంస్కరిస్తామనే వాగ్దానాలపై ప్రభుత్వం పెద్దగా ముందుకు సాగటంలేదని, ఏళ్ల తరబడి ప్రయత్నించిన తర్వాత టీ-టు-టెలికామ్‌ల సమ్మేళనం అయిన టాటా గ్రూప్‌కు జాతీయ క్యారియర్ ఎయిర్ ఇండియాను ఇటీవల విక్రయించగలిగింది. అయితే కొన్ని బ్యాంకులు, రిఫైనర్‌లు, బీమా సంస్థలను విక్రయిస్తామనే వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం పబ్లిక్ మరియు ప్రైవేట్ క్యాపెక్స్ రెండింటినీ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉందని, వ్యూహాత్మక ఉపసంహరణలు, ఆస్తుల మోనటైజేషన్ ద్వారా అదనపు వనరులను సేకరించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సంస్థలు తమ ప్రీ-బడ్జెట్ అంచనాలలో పేర్కొన్నాయి.