2019 Round up: విద్యుత్ వెహికల్స్ ‘ఫేమ్’లో టూ వీలర్స్‌కే ప్రాధాన్యం

By Sandra Ashok KumarFirst Published Dec 23, 2019, 10:31 AM IST
Highlights

విద్యుత్, హైబ్రీడ్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్-2’ పథకాన్ని అమలులోకి తెచ్చినా పెద్దగా ఫలితాలనివ్వలేదు. మౌలిక వసతుల లేమితో వినియోగదారులు ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. ఏప్రిల్- నవంబర్ మధ్య కేవలం 1500 విద్యుత్ వినియోగ కార్లు అమ్ముడవ్వడమే దీనికి కారణం. ఇదే సమయంలో 94 శాతం విద్యుత్ వాహనాల కొనుగోళ్లు టూవీలర్సే.

న్యూఢిల్లీ: భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ విద్యుత్ వాహనాల దిశగా సింక్రనైజ్ అవుతున్నదన్న సంకేతాలకు 2019 నిదర్శనంగా నిలిచింది. ఏడాది పొడవునా ఏరోజుకారోజు అభివ్రుద్ది చెందుతూ ప్రభుత్వ విధానాలతో మద్దతు పొందుతూ పెట్టుబడుల వరద పోటెత్తుతుండగా, నూతన వ్యాపార రంగంలోకి అనుమతినిస్తూ ముందుకు సాగుతుంది.  

విద్యుత్ వాహనాల కొనుగోలు దారుల కోసం ప్రభుత్వం ‘ఫేమ్’ పథకం కింద రూ.10 వేల కోట్ల పథకాన్ని అమలు చేస్తోంది. విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించడానికి గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించిన ‘ఫేమ్-2’ పథకం ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చింది. 

also read మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...ఫీచర్లు అదుర్స్!

గత నెలాఖరు వరకు దాదాపు 2.85 లక్షల మంది విద్యుత్, హైబ్రీడ్ వాహనాల కొనుగోలు దారులు ఈ పథకం వల్ల లబ్ధి పొందారు. ఫేమ్ -2 కింద రూ.3600 కోట్ల సబ్సిడీలను అందుకున్నారని కేంద్ర భారీ పరిశ్రమల, ప్రభుత్వ రంగ సంస్థల మంత్రిత్వశాఖ తెలిపింది. గత జూలైలో విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12 నుంచి ఐదో శాతానికి తగ్గించడంతో కొనుగోలు దారుల సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తుంది. 

అదనంగా విద్యుత్ వాహనాల్లో వాడే విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయిస్తూ కేంద్ర క్యాబినెట్ ప్రతిపాదనలను రూపొందించింది. ఈ-డ్రైవ్ అసెంబ్లీ, ఆన్ బోర్డ్ చార్జర్, ఈ-కంప్రెసర్, చార్జింగ్ గన్ తదితర విడి భాగాలపై మినహాయింపులు కల్పిస్తోంది. 

దేశీయంగా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పాదకతలో గణనీయ పురోగతి సాధించింది. కానీ విద్యుత్ వాహనాలను నడిపేందుకు అవసరమైన మౌలిక వసతులు అంటే 2022నాటికి కనీసం 10 గిగా వాట్ల సెల్స్, 2025 నాటికి 50 గిగావాట్ల సామర్థ్యం గల సెల్స్ వరకు విస్తరించాల్సిన అవసరం ఉన్నదని నీతి ఆయోగ్ తెలిపింది. 

2024 నాటికి ఐదేళ్లలో ఉత్పాదక ప్రోగ్రామ్ ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. భారీ స్థాయిలో ఎక్స్ పోర్ట్ కాంపిటీటివ్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీస్, సెల్ మాన్యుఫాక్చరింగ్ గిగా ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇండస్ట్రీ మద్దతుతో గ్రీన్ సస్టెయినబుల్ మొబిలిటీ దిశగా పలు రాష్ట్రాలు విధానాలను రూపొందించాయి. సుమారు 11 రాష్ట్రాలు ప్రతిపాదిత విద్యుత్ విధానాల రూపకల్పన గానీ, విధానాన్ని అమలు చేయాలని గానీ నిర్ణయించాయి. 

also read ఆటో ఎక్స్‌పోకు డజనుకుపైగా కంపెనీలు డుమ్మా...కారణం ?

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు తుది ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, ఢిల్లీ, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాల్లో వాహనాల విధానాలు ముసాయిదా స్థాయికి పరిమితం అయ్యాయి. బీఐఎస్ రీసెర్చ్ విశ్లేషకుడు అజయ్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం 2030 నాటికి 30 శాతం విద్యుత్ వాహనాలు వాడకంలోకి రావాల్సి ఉంది.

ప్రత్యేకించి టూ వీలర్, త్రీ వీలర్స్, కమర్షియల్ వాహనాల విద్యుద్ధీకరణ జరుగాలి. అథెర్ ఎనర్జీ, రివోల్ట్, ఒకినావా సంస్థలు వ్యక్తిగత రైడర్స్ పై కేంద్రీకరించాయి. లీ ఐయాన్స్, ఎలిక్ట్రిక్ సొల్యూషన్స్ వాణిజ్య వాహనాల దిశగా విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాహనాల విక్రయంలో ఒక్క శాతం మాత్రమే విద్యుత్ వాహనాలు ఉన్నాయి. గత ఎనిమిది నెలల్లో 95 శాతం ద్విచక్ర వాహనాలు ఉంటే, 1500 విద్యుత్ కారు అమ్ముడు పోయాయి. గత ఆరు నెలల్లో అత్యధికంగా 94 శాతం టూ వీలర్ వాహనాలు కొనుగోళ్లు జరిగాయి. 

click me!