సెడాన్ స్పెషాల్టీ: పండుగలకు డిస్కౌంట్లతో కార్ల వెల్‌కం!!

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 1:39 PM IST
Highlights

పండుగలు వచ్చాయంటేనే కార్పొరేట్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థల సందడే సందడి. అలాగే ఆటోమొబైల్ కంపెనీలదీ అదే హడావుడి. వినియోగదారులు కొనుగోలు చేసే సెడాన్ మోడల్ కార్లపై ఇబ్బడి ముబ్బడిగా రాయితీలిస్తున్నాయి. 

పండుగల సీజన్ ప్రారంభం కాబోతున్నది. వచ్చేనెలలో నవ రాత్రులు మొదలు విజయదశమి.. ఆ పై దీపావళి.. కార్తీకపూర్ణిమ.. ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. భారతీయులకు ప్రత్యేకించి హిందువులకు పండుగలు ఎంతో పవిత్రమైనవి. పండుగల వేళ ఇంటికి అవసరమైన వస్తువులతోపాటు ప్రయాణానికి కార్లు, మోటారు సైకిళ్లు కొనాలని భావిస్తారు. వారి సెంటిమెంట్ తెలుసుకుని మోటార్ బైక్‌లు, కార్ల తయారీ సంస్థలు అందుకనుగుణంగా డిస్కౌంట్లు అందుబాటులోకి తెస్తున్నాయి.

లగ్జరీ సెడాన్ మోడల్ కార్లపై ఆఫర్లు ఇలా
తాజాగా డిజిటల్ చెల్లింపులపైనా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు తయారు చేసిన లగ్జరీ మోడల్ సెడాన్ కార్లపై రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. హోండా, హ్యుండాయ్ సంస్థలతోపాటు ఇటీవల మార్కెట్ లోకి విడుదలైన మారుతి సుజుకి సియాజ్ మోడల్ కార్లలో పలు కొత్త ఫీచర్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఆయా సంస్థలు ఇచ్చే ఆఫర్లు, డిస్కౌంట్లు, రాయితీలు అందజేసే వివరాలిలా ఉన్నాయి.

త్వరలో మార్కెట్‌లోకి మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్  
మెర్సిడెస్- బెంజ్ సంస్థ నూతనతరం సీ - క్లాస్ కారును మార్కెట్‌లోకి తేనున్నది. ఎక్స్‌టీరియర్, న్యూ పవర్ ప్లాంట్స్ చేర్చారు. దీనిపై రూ. 6 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. బీఎండబ్ల్యూ 3 సిరీస్ డిజైన్ చేసిన సీ క్లాస్ సెడాన్, జాగ్వార్ ఎక్స్ఈ, ఆడి ఏ4 సెడాన్ కార్లకు పోటీగా మెర్సిడెస్ ఈ ‘సీ క్లాస్’ కారు మార్కెట్‌లోకి రానున్నది.

భారతదేశంలో సీ- క్లాస్ కారు మూడు వేరియంట్లు.. సీ-220డీ స్టైల్, సీ 220డీ అవంత్గార్డే, సీ 250డీ అవంత్గార్డేల్లో విక్రయించనున్నారు. సీ 220 వేరియంట్ 2.2 లీటర్ల డీజిల్ 170బీహెచ్పీ సామర్థ్యం కలిగి ఉన్నది. సీ -250కి 2.2 లీటర్ల సామర్థ్యం పవర్ ప్లాంట్ ఉన్నా పవర్ 204 బీహెచ్పీ సామర్థ్యం ఉంటుంది. 

రూ. లక్ష వరకు వోక్స్ వ్యాగన్ వెంటో డిస్కౌంట్
వోక్స్ వ్యాగన్ సంస్థకు చెందిన వెంటో కారు పూర్తిగా మారిపోయింది. 2015 నాటి ఈ మోడల్ కారు వెంటోలో పూర్తిగా నూతన రూపుదిద్దుకున్న ఇంజిన్, ఇతర ఫీచర్లు చేర్చారు. 1.5 లీటర్లు 4 సిలిండర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం.

103 బీహెచ్పీ, 250 ఎన్ఎం టార్చ్‌తోపాటు 1.6 లీటర్ల ఎంపీఐ లేదా 1.2 లీటర్ల టర్బో చార్జిడ్ టీఎస్ఐ ఇంజిన్ కూడా ఉంటుంది. ఎంపీఐ 105 బీహెచ్పీ, 153 ఎన్ఎం టార్చి, టీఎస్ఐ పవర్ ప్లాంట్ 105 బీహెచ్పీ, 175 ఎన్ఎం సామర్థ్యం అందుబాటులో ఉంటుంది. 5 -స్పీడ్ మాన్యువల్ అండ్ 7 - స్పీడ్ డీఎస్జీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా అమర్చారు. దీనిపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తుంది. 

టయోటా కొరొలా ఆల్టిస్‌పై రూ. లక్ష రాయితీ
టయోటా కిర్లోస్కర్ సంస్థ భారతీయ మార్కెట్‌లోకి డీ - సెగ్మెంట్ మోడల్ కారు ‘కొరొల్లా ఆల్టిస్’ విడుదల చేస్తోంది. ఈ కారు కొనుగోలుపై రూ. లక్ష కాస్మొటిక్స్, అప్‌డేట్స్‌ చేసిన ఫీచర్స్ అందుబాటులోకి రానున్నాయి. ఎల్ఈడీ ల్యాంపులకు డీఆర్ఎల్స్, న్యూ అల్లాయ్స్, రీ డిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ అదనంగా చేర్చారు.

ఇంటీరియర్‌గా న్యూ హెచ్వీఏసీ కంట్రోల్స్, డాష్ బోర్డ్ కోసం న్యూ పినిష్ ఏర్పాటు చేశారు. 1.8 లీటర్ల పెట్రోల్ సామర్థ్యం గల ఇంజిన్, 138 బీహెచ్పీ ఆఫ్ పీక్ పవర్.. 1.4 లీటర్ల సామర్థ్యం గల డీజిల్ వేరియంట్ 87 బీహెచ్పీ పవర్ సామర్థ్యం ఉంది. దీని కొనుగోలుపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

హ్యుండాయ్ ఎక్స్‌సెంట్‌పై రూ.90 వేల వరకు డిస్కౌంట్
మారుతి సుజుకి డిజైర్, ఇటీవలే విడుదలైన హోండా అమేజ్ సెడాన్ పోటీగా హ్యుండాయ్ సెడాన్ మోడల్ కారు ఎక్స్‌సెంట్‌ మార్కెట్ లోకి రాబోతోున్నది. హ్యుండాయ్ గ్రిల్లె సిగ్నేచర్ ఎక్స్‌సెంట్‌ కారుకు చెందిన అన్నివేరియంట్ల కార్లలో ప్రీమియం కాబిన్, ఏబీఎస్, ఈబీడీ ప్రమాణాలతో కూడిన సేఫ్టీ ఫీచర్లు చేర్చారు.

హ్యుండాయ్ ఎక్స్‌సెంట్‌ మోడల్ కారు పెట్రోల్ ఆటో కాంబోనేషన్ సెడాన్ అందుబాటులో ఉంది. మారుతి సుజుకి, హోండా అమేజ్ మోడల్ కార్లతో పోలిస్తే హ్యుండాయ్ ఎక్స్‌సెంట్‌ మోడల్ కారుకు డీజిల్ - ఆటో కాంబో ఫెసిలిటీ అందుబాటులో లేదు. 

టాటా జెస్ట్ ప్రిమియోపై రూ.80 వేల రాయితీ
టాటా మోటార్స్ సరికొత్తగా రూపొందించిన జెస్ట్ ప్రిమియో కారు భారత మార్కెట్ లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. 1.3 లీటర్ల డీజిల్ ఇంజిన్, 75 బీహెచ్పీ పీక్ పవర్ సామర్థ్యం దీని సొంతం. జస్ట్ ప్రిమియో మోడల్ కారు టాప్ ఎక్స్ టీ ట్రింప్ కింద వివిధ వేరియంట్ల సెడాన్ మోడల్ కార్లలో 

మారుతి సుజుకి డిజైర్ కొంటే రూ.50 వేలు డిస్కౌంట్
మిడ్ సైజ్ సెడాన్ మార్కెట్ లీడర్ మారుతి సుజుకి ‘డిజైర్’ కొన్న వారికి రూ.50 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. పోటీ తత్వంతో కూడిన నాణ్యత గల మోడల్ కార్లకే ప్రాధాన్యం ఏర్పడుతోంది. ఈ కారులో టాప్ క్లాస్ క్యాబిన్ స్పేస్, డీజిల్ - పెట్రోల్ బేసిక్ పవర్ ప్లాంట్ అదనపు వసతులు కల్పిస్తున్నాయి. 

హోండా సిటీ కారు కొన్న వారికి రూ.75 వేల రాయితీ
భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ మోడల్ కార్లలో ఒకటి హోండా సిటీ కారు. మారుతి సుజుకి సియాజ్ ఫేస్ లిఫ్ట్, హ్యుండాయ్ వెర్నా, వోక్స్ వ్యాగన్ వెంటో, స్కోడా రాపిడ్, టయోటా యారిస్ మోడల్ కార్లకు హోండా సీటీ మోడల్ కారు పోటీదారుగా మారనున్నది. 1.5 లీటర్ల పెట్రోల్ వేరియంట్ కారు 119 బీహెచ్పీ, 1.5 లీటర్ల డీజిల్ వేరియంట్ కారు 100 బీహెచ్పీ పీక్ పవర్ కలిగి ఉంటుంది. 

హ్యుండాయ్ వెర్నాపై రూ.60 వేల డిస్కౌంట్ 
భారతదేశ మార్కెట్ లో అత్యదికంగా అమ్ముడు పోతున్న కార్లలో హ్యుండాయ్ వెర్నా మోడల్. దీన్ని కొనుగోలు చేసిన వారికి రూ.60 వేల రాయితీ లభిస్తోంది. మిడ్ సైజ్ ఆటోమొబైల్ సెగ్మెంట్ మోడల్ కారుగా హ్యుండాయ్ వెర్నా విమర్శకుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నది.

సన్ రూఫ్, కూల్డ్ సీట్లు తదితర ఫీచర్లు హ్యుండాయ్ వెర్నాలో లభ్యం. 1.6 లీటర్ల డీజిల్ వేరియంట్ ఇంజిన్ 128 బీహెచ్పీ సామర్థ్యం కలిగి ఉంటే అదే స్థాయి పెట్రోల్ మోడల్ కారు 123 బీహెచ్పీ సామర్థ్యం పొందింది. 

click me!