అడిషనల్ సేఫ్టీ ఫీచర్లతో టాటా విపణిలోకి టిగోర్‌: రూ.6.39 లక్షల నుంచి షురూ!

By rajesh yFirst Published Jun 18, 2019, 11:55 AM IST
Highlights

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం ‘టాటా మోటార్స్’ అధునాతన సేఫ్టీ ఫీచర్లతో విపణిలోకి టిగోర్స్ మోడల్ కార్లు విడుదల చేసింది. దీని ధర రూ.6.39లక్షల నుంచి ప్రారంభం కానున్నది.

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ నుంచి ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ (ఏఎంటీ) వెర్షన్‌లో కాంపాక్ట్‌ సెడాన్‌ టిగోర్‌ కార్లు విపణిలోకి విడుదలయ్యాయి. ఎక్స్‌ఎంఏ, ఎక్స్‌జెడ్‌ఏ+ ఏఎంటీ శ్రేణిలో విడుదలైన ఈ కార్ల ధరల శ్రేణి రూ.6.39-7.24 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ రెండు కార్లను టాటా మోటార్స్ 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో తయారు చేసింది.


‘వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకొచ్చిన ఉత్పత్తులివి. ఆటోమేటిక్‌ పోర్ట్‌ఫోలియోలో మా ఉత్పత్తులను నిరంతరం పెంచుకుంటూ పోవడంతోపాటు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం’అని అంటూ టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన వ్యాపార విభాగం  సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎన్‌ బర్మన్‌ చెప్పారు.


డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ-లాక్‌ బ్రేక్స్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌-ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌, కార్నర్‌ స్టెబిలిటీ నియంత్రణ, రివర్స్‌ పార్కింగ్‌ సెన్సార్స్‌, స్పీడ్‌ డిపెండెంట్‌ ఆటోమేటిక్‌ డోర్‌ లాకింగ్‌, ఇంజిన్‌ ఇమ్మొలిలైజర్‌ వంటి భద్రతా ప్రమాణాలతో ఈ కార్లను రూపొందించినట్లు టాటా మోటార్స్‌ తెలిపింది. వినియోగదారుల ఆకాంక్షలను అందుకునేదుకు కంపెనీ ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. 


ప్రాక్టికల్‌గా, పర్ ఫెక్ట్ కాంబినేషన్‌తో నూతన ఫీచర్లు చేర్చారు. టాటా మోటార్స్ టిగోర్ ఎక్స్ జడ్ ప్లస్ మోడల్ కారులో ఆపిల్ కారు ప్లే, ఆండాయిడ్ ఆటోతోపాటు 7 అంగుళాల టచ్ స్ర్కిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 ఇంచ్‌ల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ లైట్లతోపాటు ఆటో పోల్డ్ ఔట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ (ఓఆర్వీఎంఎస్) ఉంటాయి. 

బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, ఫోల్డబుల్ రేర్ ఆర్మ్ రెస్ట్, కప్ హోల్డర్ల్స్ వంటి ఫీచర్లు చేర్చారు. దీంతోపాటు సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేక్స్, ఎలక్ట్రానికి బ్రేక్ -ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు, స్పీడ్ డిపెండెంట్ ఆటోమేటిక్ డోర్ లాకింగ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ తదితర ఫీచర్లు చేర్చారు.
 

click me!