అత్యంత పవర్ ఫుల్ హ్యాచ్ బ్యాక్ కార్లు: రూ. 10 లక్షల్లోపు ఇవే

By telugu teamFirst Published 19, May 2019, 3:17 PM IST
Highlights

టాటా టియాగో జేటీపీ, మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్, వోక్స్ వ్యాగన్ పోలో జీటీ, ఫోర్డ్ ఫిగో వంటి కార్లు ఫ్యూయల్ ఎఫిసియెన్సీతోపాటు తక్కువ ధరకే అందుబాటులో ఉన్న హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లు

అదునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆటోమొబైల్ సంస్థలు తమ కార్ల తయారీలో పలు విలక్షణ పద్ధతులకు తెర తీస్తున్నాయి. ఫ్యూయల్ ఎఫిసియెన్సీ మొదలు విలాసవంతమైన సెడాన్ కార్ల బరువు తగ్గింపుతోపాటు ఆయా మోడల్ కార్లను బట్టి వాటి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 

ఆటో మేకర్లు తమ కార్ల పనితీరు, ఫ్యూయల్ ఎఫిసియెన్సీపైనే ఫోకస్ చేస్తున్నారు. అందునా హ్యాచ్ బ్యాక్ కార్ల విభాగంలోనే ఫ్యూయల్ ఎఫిసియెన్సీ, తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 100 బీహెచ్పీకి పైగా సామర్థ్యం కలిగి ఉండటంతోపాటు రూ.10 లక్షల్లోపు ధర గల కార్లు ఉన్నాయి. వాటిల్లో పేరెన్నికగన్న కార్ల మోడల్స్ కొన్ని పరిశీలిద్దాం.. 

మార్కెట్లో వర్తీ కాంపిటీటర్ టాటా టియాగో జేటీపీ 

టాటా మోటార్స్ ప్రొడక్ట్స్‌ల్లో శక్తిమంతమైన మోడల్ కారు ‘టాటా టియాగో జేటీపీ’ ఒకటి. 1.2 లీటర్ల టర్బో చార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్,  5 - స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తోపాటు 112 హెచ్పీ, 150 ఎన్ఎం టార్చి శక్తి కలిగి ఉంటుంది. దీని ధర మార్కెట్లో రూ.6.39 లక్షలు మాత్రమే. మార్కెట్లో వర్తీ కాంపిటీటర్ అంటే టియాగో జేటీపీ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. 

పాకెట్ రాకెట్ ఐడియా వోక్స్ వ్యాగన్ పొలో జీటీ  
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ మోడల్ కారు ‘పోలో జీటీ’ పాకెట్ రాకెట్ ఐడియాగా నిలిచింది. ఇది రెండు ఇంజిన్లలో లభిస్తుంది. 1.2 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ వర్షన్ ఇంజిన్ వర్షన్లతో దీన్ని తయారు చేస్తున్నారు. 103 హెచ్పీతోపాటు 175 ఎన్ఎం ఆఫ్ టార్చి నుంచి తదుపరి దశలో 250 ఎన్ఎం ఆఫ్ టార్చితో 108 హెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. 

మారుతి బాలెనో ఆర్ఎస్ ధర రూ.8.76 లక్షలే
మారుతి సుజుకి ఆర్ఎస్ వేరియంట్ బాలెనో త్రీ సిలిండర్ వన్ లీటర్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 150 ఎన్ఎం టార్చితోపాటు 100హెచ్పీ శక్తిని వెలువరిస్తుంది. 5 - స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ విధానంలో ఇంజిన్ తీర్చి దిద్దారు. మార్కెట్లో మారుతి బాలెనో ధర రూ.8.76 లక్షలు. 

రూ.6.13 లక్షలకే ఫోర్డ్ ఫిగో మోడల్ కారు  
1.5 లీటర్ల టీడీసీఐ డీజిల్ ఇంజిన్ రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న కారు ఫోర్డ్ ఫిగో. 215 ఎన్ఎం టార్చితోపాటు 100 హెచ్పీ శక్తిని అందిస్తుంది. మార్కెట్లో దీని ధర రూ.6.13 లక్షలుగా ఉంది. 

Last Updated 19, May 2019, 3:17 PM IST