జర్మనీ టెస్లాకు సవాల్: మార్కెట్‌లోకి మెర్సిడెస్ ‘ఈక్యూసీ’

By narsimha lodeFirst Published 6, Sep 2018, 11:16 AM IST
Highlights

బ్యాటరీ కార్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టెస్లాకు సవాల్ విసిరేందుకు ప్రత్యర్థి మెర్సిడెస్ సిద్ధమైంది. అందులో భాగంగా ‘ఈక్యూసీ’ మోడల్ విద్యుత్ కారును స్టాక్ హోంలో జరిగిన ఒక కార్యక్రమంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది

స్టాక్ హోం: బ్యాటరీ కార్లలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న టెస్లాకు సవాల్ విసిరేందుకు ప్రత్యర్థి మెర్సిడెస్ సిద్ధమైంది. అందులో భాగంగా ‘ఈక్యూసీ’ మోడల్ విద్యుత్ కారును స్టాక్ హోంలో జరిగిన ఒక కార్యక్రమంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. రేర్ లైట్, క్లియర్ కట్ ఇంటిరియర్స్‌తో రూపొందించిన ఈ ఎస్‌యూవీ మోడల్ 450 కి.మీ వేగంతో దూసుకెళ్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. లగ్జరీ కస్టమర్లు, టెక్కీ సావీలకు తమ ‘ఈక్యూసీ’ మోడల్ కారు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మెర్సిడెస్ భావిస్తోంది. ఈ కారు మార్కెట్‌లోకి ప్రవేశించడంతో జర్మనీకి చెందిన టెస్లాకు నేరుగా సవాల్ విసిరినట్లేనని భావిస్తున్నారు.

2022 నాటికి 10 విద్యుత్ వినియోగ కార్లను మార్కెట్ లోకి తేవడమే లక్ష్యమని డయిమర్ సీఈఓ డైటర్ జెట్‌స్కీ చెప్పారు. 2025 నాటికి మొత్తం కార్ల కొనుగోళ్లలో ఈక్యూసీతోపాటు ఇతర విద్యుత్ కార్ల కొనుగోళ్లు 15 - 25 శాతం ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

జర్మనీకి చెందిన టెస్లా కంపెనీ తమ వినియోగదారులకు విద్యుత్ వినియోగ కారు వాడమని సూచిస్తున్నది. భారీ స్తాయిలో ఉత్పత్తికి చర్యలు చేపట్టింది. డీజిల్ వినియోగ కార్లపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడంతో కొనుగోలు ధర ప్రియంగా మారింది. దీని స్థానే విద్యుత్ కారు కొనుగోలు చౌకగా మారింది.

ఇప్పటివరకు వినియోగదారుల ఆకాంక్షలు, పరిస్థితులకు అనుగుణంగా కార్ల తయారీలో టెస్లాకు పోటీదారులెవ్వరూ లేరు. ప్రత్యేకించి భారీస్థాయిలో విద్యుత్ వినియోగ కార్ల తయారీ మొదలు డీలర్ షిప్, సర్వీసింగ్, సపోర్టింగ్ తదితర అంశాల్లో నాణ్యతతో సేవలందించిన ట్రాక్ రికార్డు ఏ సంస్థకూ లేదన్న విమర్శ ఉంది. 

శతాబ్ధ కాల అనుభవం గల జర్మనీ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’కు లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడు నూతన మోడల్స్ ను మార్కెట్ లోకి ఆవిష్కరిస్తూ తన ఉత్పత్తులతో ముందుకు వెళుతున్నది. డయిమర్ సీఈఓ జెట్ స్కీ మాట్లాడుతూ జర్మనీలో విద్యుత్ కార్ల తయారీలో టెస్లా చాలా విజయవంతమైందన్నారు. తాము ఉత్పత్తి చేసిన ‘ఈక్యూసీ’ మోడల్ కారు ఎంత మాత్రమూ టెస్లా విడుదల చేసిన మూడు విద్యుత్ వినియోగ కార్లకు పోటీ కాదన్నారు. అయితే మెర్సిడెస్ ‘ఈక్యూసీ’ మోడల్ ఎస్ యూవీ కారు అంటే వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉన్నదని చెప్పారు. అయితే ఈక్యూసీ మోడల్ కార్లు ఎన్ని ఉత్పత్తి చేశారన్న విషయం మాత్రం జెట్ స్కీ వెల్లడించలేదు.

Last Updated 9, Sep 2018, 11:18 AM IST