టాప్‌గేర్‌లో మారుతి ‘విటారా బ్రెజా’: 3 ఏళ్లలో 4 లక్షల సేల్స్

By rajesh yFirst Published Feb 20, 2019, 10:33 AM IST
Highlights

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ మరో రికార్డు సొంతం చేసుకున్నది. 2016 మార్చిలో రోడ్డెక్కిన మారుతి సుజుకి విటారా బ్రెజా మూడేళ్లలోపు నాలుగు లక్షల వాహనాలు అమ్ముడు పోవడమే ఆ రికార్డు. ఎస్ యూవీ కార్ల విక్రయాల్లో దాని వాటా 44.1 శాతం మరి అదీ మారుతి సుజుకి స్పెషాలిటీ. 

న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకి శిఖలో మరో రికార్డు చేరింది. ఆ సంస్థ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారు విటారా బ్రెజ్జా అమ్మకాలు టాప్‌గేర్‌లో దూసుకు వెళ్లాయి. దేశీయ మార్కెట్లోకి విడుదలైన మూడేళ్లలోనే నాలుగు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినెల సరాసరిగా ఏడు శాతం వృద్ధితో 14,675 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. మూడేళ్ల లోపే నాలుగు లక్షల మార్క్‌కు చేరుకోవడం సంతోషం కల్గిస్తున్నదని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సీ చెప్పారు. 

వినియోగదారులు కోరుకుంటున్న విధంగా మోడల్‌లో పలు మార్పులు చేయడం కూడా ఇందుకు కలిసొచ్చిందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌ఎస్ కల్సీ తెలిపారు. 2016 మార్చిలో  దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది బ్రెజ్జా కారు. 

కంపెనీ మొత్తం వాహన విక్రయాల్లో ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్ కలిగిన ఈ మోడల్ వాటా 20 శాతంగా ఉన్నది. ఇప్పటివరకు దేశంలో కాంపాక్ట్  ఎస్‌యువీ కార్ల విభాగంలో విటారా బ్రెజా వాహన అమ్మకాల వాటా 44.1శాతం ఉందని కంపెనీ తెలిపింది.  

click me!
Last Updated Feb 20, 2019, 10:33 AM IST
click me!