టాటా హెక్సాకు సవాల్: మార్కెట్లోకి మహీంద్రా న్యూ స్కార్పియో

By rajesh yFirst Published Nov 13, 2018, 10:51 AM IST
Highlights

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన పాపులర్‌ ఎస్‌యూవీ స్కార్పియోలో ‘ఎస్9’ మోడల్ పేరిట రూపొందించిన వాహనాన్ని సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 13.99 లక్షలుగా ఉంటుంది.

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) తన పాపులర్‌ ఎస్‌యూవీ స్కార్పియోలో ‘ఎస్9’ మోడల్ పేరిట రూపొందించిన వాహనాన్ని సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 13.99 లక్షలుగా ఉంటుంది. ఈ వేరియంట్‌లో 140 బిహెచ్‌పీతో కూడిన ఎంహాక్‌ ఇంజన్‌, పూర్తి స్థాయిలో ఆటోమెటిక్‌ టెంపరేచర్‌ నియంత్రణ, 15 సెంటీమీటర్‌ టచ్‌ స్ర్కీన్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌, పది భాషల్లో జీపీఎస్‌ నావిగేషన్‌, పానిక్‌ బ్రేక్‌ ఇండికేషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి.

2.2-లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజిన్‌, 140 హెచ్‌పీ వద్ద 320 ఎన్‌ఎం టార్క్‌, 6 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్మిషన్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, డ్యుయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, 5.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ తదితర ఫీచర్లు కూడా ఉంటాయి. అలాగే స్టీరింగ్‌ వీల్‌పై ఇంటిగ్రేటెడ్‌ టర్న్‌ ఇండికేటర్లతోపాటు, ఆడియో, క్రూయిస్‌ కంట్రోల్‌ బటన్లను అమర్చామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. కొత్త వాహనం టాటా హెక్సాతో గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాల అంచనా. తక్షణం వినియోగదారులకు మార్కెట్లో అందుబాటులో ఉంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. వినియోగదారులు తమ డీలర్లను సంప్రదించ్చునని తెలిపింది. 

మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ అధిపతి విజయ్ రామ్ నక్రా మాట్లాడుతూ స్కార్పియో ‘ఎస్9’ మోడల్ వాహనాన్ని ఇష్టపడే వినియోగదారులకు గొప్ప ఫీచర్ ఫ్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రూ బ్లూ‌ఎస్ యూవీ కొనుగోలు చేసే కస్టమర్లకు ఆకర్షణీయమైన ధర అందుబాటులో ఉందని చెప్పారు. 
 

click me!