Important Summer Driving Safety: ఎండాకాలంలో వాహ‌న‌దారులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

By team telugu  |  First Published Mar 29, 2022, 12:11 PM IST

కారు, స్కూటర్, బైక్ వంటి వాటికి పెట్రోల్, డీజిల్ కొట్టించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మోసపోకుండా ఉండొచ్చు. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. పెట్రోల్ బంకుల్లో కూడా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.


పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించేటప్పుడు పెట్రోల్ మిషన్‌లో రీడింగ్ చూసుకోవాలి. రీడింగ్ జీరో వద్ద ఉండాలి. అప్పుడే వెహికల్ ఫ్యూయెల్ కొట్టించుకోవాలి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కస్టమర్లకు పెట్రోల్ బంకుల్లో ప్యూరిటీ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. అంటే పెట్రోల్, డీజిల్ క్వాలిటీ తెలుసుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంకులో ఫిల్టర్ పేపర్ టెస్ట్ ఫెసిలిటీ ఉంటుంది. మీకు పెట్రోల్ నాణ్యత మీద అనుమానం ఉంటే.. పేపర్ టెస్ట్ చేయొచ్చు. పెట్రోల్ పేపర్ మీద రెండు మూడు చుక్కలు వేస్తే.. అది వెంటనే ఆవిరి అవుతుంది. పేపర్ మీద ఎలాంటి మరక ఉండదు. ఒకవేళ మరకలు ఉంటే.. అప్పుడు ఆ పెట్రోల్ క్వాలిటీ సరిగా లేదని అర్థం చేసుకోవాలి.

ఇంకో రకం మోసం కూడా జరిగేందుకు అవకాశం ఉంటుంది. పెట్రోల్ కొట్టే వారు కూడా మోసం చేస్తుంటారు. మీరు ఫుల్ ట్యాంక్ కొట్టమని చెబుతారు. కానీ వాళ్లు రూ.100 లేదా రూ.200 కొట్టి ఆపేస్తారు. మీరు ఫుల్ ట్యాంక్ అని చెబుతారు. అప్పుడు ఆయన ముందు కొట్టిన రీడింగ్‌‌కు సెపరేట్‌గా డబ్బులు తీసుకోవచ్చు. మళ్లీ ఫుల్ ట్యాంక్‌కు డబ్బులు కట్టాలి. కానీ రీడింగ్ మాత్రం ఒక్కటే. ఇలా కూడా మోసం చేస్తుంటారు. ఇంకా కొంత మంది పెట్రోల్‌ లేదా డీజిల్‌ను ఆపి ఆపి కొడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా కస్టమర్లు మోసపోవాల్సి వస్తుంది. పైపులో కొంత ఫ్యూయెల్ ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. కొత్త మెషీన్లలో అయితే ఈ ప్రాబ్లమ్ ఉండదు. అయితే ఎండాకాలంలో వాహ‌న‌దారులు వాహ‌నాల‌పై ప‌లు జాగ్రత్తలు తీసుకోవాలి.

Latest Videos

undefined

వాహ‌న‌దారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!

మామూలు రోజులుకంటే ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల అగ్నిప్రమాదాలు, వాహనాలు కాలిపోవడం త్వరగా జరుగుతుంటాయి. ఈ మధ్యకాలంలో చాలా వాహనాలు రోడ్లపైనే పేలిపోతుండడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి.

- ఎండాకాలంలో ఎప్పుడూ కూడా ఫుల్ ట్యాంక్ పెట్రోల్, డీజిల్ కొట్టించకూడదు. దీని వల్ల వాహనాలు పేలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి.. సగం ట్యాంక్ వరకూ పెట్రోల్ కొట్టిస్తే స‌రిపోతుంది.

- అదేవిధంగా కార్లు, బైక్‌లు ఎండలో పార్క్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతలు పెట్రోల్‌, డీజిల్‌‌కి ఉండే మండే శక్తితో ఏకమై దగ్ధమయ్యే అవకాశముంది.

- సాధారణంగా ఎక్కువ అసవరం అయితే తప్ప ఎండల్లో వాహనాలు నడపకూడదు. దీనివల్ల వాహనాలకే కాదు. ఆ ప్రభావం మన శరీరంపై కూడా పడుతుంది.

- ఒకవేళ తప్పనిసరి వాహనాలపై ప్రయాణించాల్సి వస్తే.. మధ్యమధ్యలో కాస్తా విరామం ఇచ్చి నడపడం మంచిది.

- వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇంజిన్ నుంచి ఎక్కువగా శబ్ధాలు వస్తుంటాయి. వీటిని ఎంతమాత్రం చులకనగా చూడొద్దు. తప్పనిసరిగా మెకానిక్‌కి చూపించాలి.

- ఎండాకాలం పూర్తయ్యేవరకూ ప్రతి 15 రోజులకోసారి వాహనాలను మెకానిక్‌ దగ్గరికి తీసుకెళ్ళాలి.

- చాలామంది పెట్రోల్ బంక్‌ల వద్ద మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడుతుంటారు. అలా చేయడం చాలా డేంజర్ వాటినుంచి వచ్చే రేడియేషన్ వల్ల వాహనాలు దగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువ.
 

click me!