బ్రెగ్జిట్ ఎఫెక్ట్ నాటే జోక్: బ్రిటన్ ‘హోండా’ ప్లాంట్ షట్‌డౌన్

By rajesh yFirst Published Feb 20, 2019, 10:37 AM IST
Highlights

బ్రెగ్జిట్ ఎఫెక్ట్ ఆటోమొబైల్ దిగ్గజాలపై బాగానే ప్రభావం చూపుతోంది. ఇంతకుముందు టాటా మోటార్స్ తన జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థను వచ్చే ఏప్రిల్ నెలలో కొన్ని రోజులు మూసేయనున్నది. అంతకుముందు నిస్సాన్ కూడా ఇంగ్లాండ్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసింది.

టోక్యో: యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం ‘ఆటోమొబైల్ రంగ’ సంస్థలకు కష్టాలు తెచ్చి పెట్టింది. ఇప్పటికే భారత్ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. బ్రిటన్‌లోని జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) యూనిట్‌ను బ్రెగ్జిట్ ప్రభావం పుణ్యమా? అని ఏప్రిల్ నెలలో మూత పడే సంకేతాలిచ్చింది.

దీనికి చైనాలో మందగమనం కూడా ఒక కారణం. ఇక జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీ బ్రిటన్‌లో నిర్వహిస్తున్న ప్లాంట్‌ను మూసి వేయబోతున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. దీంతో ఈ యూనిట్‌లో పనిచేసే 3,500 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోనున్నారని హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో ఆందోళన వ్యక్తం చేశారు. 

అయితే బ్రెగ్జిట్ నేపథ్యంలో తమ యూనిట్‌ను మూసివేయడం లేదని హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ తీవ్రతరం కావడంతోపాటు విద్యుత్‌తో నడిచే వాహనాలను రూపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

బ్రెగ్జిట్ వల్ల ఏయే మార్పులు చోటు చేసుకుంటాయో ఇప్పటికీ తమకు తెలియదని హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు, ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి తగు ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 

బ్రిటన్‌లో తమ ప్లాంట్ మూసివేయడం వల్ల ఉపాధి కోల్పోయే ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో  పేర్కొన్నారు. హోండాకు చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సివిక్ మోడల్ ఈ ప్లాంట్‌లోనే తయారవుతున్నది. 
ఈ ప్లాంట్‌లో ప్రతియేటా 1.50 లక్షల కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. 
ఆసియా, ఉత్తర అమెరికా దేశాల్లో కంపెనీకి చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉన్నదని హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో చెప్పారు. అందువల్లే ఈ బ్రిటన్ ప్లాంట్‌ను పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో చెప్పారు.

వచ్చే మూడేళ్ల నుంచి జపాన్ నుంచి సివిక్ మోడల్‌ను బ్రిటన్‌కు ఎగుమతి చేయనున్నట్లు హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో ప్రకటించారు. టర్కీలో ఉన్న ప్లాంట్ ను తరలించనున్నట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. 

వీటికి తోడు భారత్, చైనాలకు చెందిన కార్ల తయారీ సంస్థల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నట్లు హోండా కార్స్ అధ్యక్షుడు, సీఈవో తకహిరో హచిగో చెప్పారు. వచ్చే నెల 29 నుంచి యూరోపియన్ యూనియన్ దేశాల నుంచి బ్రిటన్ వైదొలుగుతుండటంతో వ్యాపారవేత్తల్లో ఆందోళన మరింత తీవ్రతరమైంది. అంతకుముందు నిస్సాన్ కూడా ఇంగ్లాండ్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలు లేవని స్పష్టంచేసింది.
 

click me!
Last Updated Feb 20, 2019, 10:37 AM IST
click me!