నాలుగేళ్లలో 60% విద్యుత్ హైబ్రీడ్ వెహికల్స్‌దే హవా!!

By Arun Kumar PFirst Published Sep 20, 2018, 10:34 AM IST
Highlights

2022 నాటికి తాము ఉత్పత్తి చేసే కార్లన్నీ పెట్రోల్ కమ్ హైబ్రీడ్ విద్యుత్ వినియోగ వాహనాలే ఉంటాయని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫెర్రారీ ప్రకటించింది. 2022 వరకు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తయ్యాక ఎస్ యూవీ మోడల్ పురోసాంగ్యూ కారును మార్కెట్ లోకి విడుదల చేస్తామని తెలిపింది. మరోవైపు మరో నాలుగేళ్లలో సంస్థ పూర్తిగా కర్బన రహితంగా మారుతుందని ప్రకటించింది మహీంద్రా అండ్ మహీంద్రా. 

వచ్చే నాలుగేళ్లలో అత్యధికంగా తొలి ఎస్‌యూవీ మోడల్‌తోపాటు హైబ్రీడ్ పెట్రోల్- విద్యుత్ కార్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఇటాలియన్ స్పోర్ట్స్ కార్ల ఉత్పత్తిదారు ‘ఫెర్రారీ’ ప్రకటించింది. సంస్థ సీఈఓ లూయిస్ కమిల్లేరీ మాట్లాడుతూ 2022 నాటికి సుమారు హైబ్రీడ్ పవర్ ట్రైన్స్‌తోకూడిన 60 శాతం మోడల్ కార్లను ఉత్పత్తి చేయనున్నామని చెప్పారు. 

2022 తర్వాత ‘ఫెర్రారీ’ తొలి విద్యుత్ ఎస్‌యూవీ పురోసాంగ్యూ 
ప్రస్తుత బిజినెస్ ప్లాన్ మేరకు 2022 నాటికి నిర్దేశిత ప్లాన్ ప్రకారం కార్లను ఉత్పత్తి చేసిన తర్వాతే లో స్లంగ్ ఎరోడైనమిక్ స్పోర్ట్స్ కారు ‘పురోసాంగ్యూ’ను తయారు చేస్తామని ఫెర్రారీ సీఈఓ లూయిస్ కమిల్లేరి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ గజ్లింగ్ ఫెర్రారీ సంస్థ కర్బన ఉద్గారాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుందని ఎక్కువ విమర్శలు కొని తెచ్చుకున్నది. కానీ ప్రస్తుతం కార్ల యజమానుల్లో పర్యావరణ హితం పట్ల అనుకూల వాతావరణంపై మోజు పెరుగుతోంది. గత నెలలో ఫెర్రారీ స్టాక్స్ ఎనిమిది శాతం పతనం కావడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అవుతోంది. 

22 ఏళ్లలో కర్బనరహితంగా మహీంద్రా అండ్ మహీంద్రా
మరో 22 ఏళ్లలో కార్బన రహితంగా మహీంద్రా అండ్ మహీంద్రా
2040 నాటికి మహీంద్రా అండ్ మహీంద్రా కర్బన రహితంగా రూపుదిద్దుకోవాలని కంకణ బద్ధురాలైంది. రోజురోజుకు భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో కాలుష్య నివారణ దిశగా అడుగులేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా సంప్రదాయేతర ఇంధన వినియోగాన్ని పెంచడం ద్వారా ఎనర్జీ ఎఫిషియెన్సీపై ఫోకస్ పెట్టింది. 

భూతాపానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగస్వామి ‘మహీంద్రా’ 
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘భూతాపానికి వ్యతిరేకంగా మనమంతా అంతర్జాతీయంగా పోరాటం చేస్తున్నాం. ఇదే మన నూతన లక్ష్యం. 2040 నాటికి కర్బన రహితంగా ఉత్పత్తులను తీర్చిదిద్దేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా అందుబాటులో ఉన్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా తొలిసారిగా అంతర్గతంగా కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం నిధులు ఖర్చు చేసిన సంస్థగా నిలిచింది. 
 

click me!
Last Updated Sep 20, 2018, 10:34 AM IST
click me!