టీవీఎస్ మోటార్స్ సరికొత్త సొబగులతో విపణిలోకి జూపిటర్ గ్రాండ్ పేరిట సరికొత్త స్కూటర్ ను ఆవిష్కరించింది. విపణిలో దీని ధర రూ.62,346గా నిర్ణయించింది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తన వాహన శ్రేణిలోని జూపిటర్‌కు సరికొత్త హంగులు తొడిగి విపణిలోకి విడుదల చేసింది. అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లతో జూపిటర్ గ్రాండ్‌గా మార్కెట్లోకి వచ్చిన దీని ధరను కంపెనీ రూ.59,900గా నిర్ణయించారు.
పేరుకు తగినట్లుగానే కంపెనీ ఈ మోడల్‌లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇంజిన్ సామర్థ్యం పరంగా టీవీఎస్ జూపిటర్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. 110సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7.6హెచ్‌పీ శక్తిని, 8.4 న్యూటన్ మీటర్ టార్చి విడుదల చేస్తుంది.
undefined
ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లు ఎవరైనా తమ ఫోనును స్కూటర్‌తో అనుసంధానించుకొని కాల్ నోటిఫికేషన్, టెక్స్ట్ నోటిఫికేషన్, ఓవర్ స్పీడ్ అలర్ట్, ట్రిప్ రిపోర్ట్ వంటి ఫీచర్లు అనేకం పొందవచ్చు.
వీటితో పాటు జుపిటర్ గ్రాండ్‌లో సెమీ డిజిటల్ మీటర్, సెమీ డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ఫ్యూయల్ ఇండికేటర్, ఒడో మీటర్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్, హెల్మెట్ రిమైండర్ వంటి అత్యాధునిక ఫీచర్లను జోడించారు.
అంతేకాకుండా దీని వెనుకవైపు సస్పెన్షన్ అడ్జెస్ట్ చేసుకునే విధంగా రూపొందించినట్లు టీవీఎస్ మోటార్స్ తెలిపింది. మరింత ఆకర్షణీయంగా ఉండటం కోసం 3డీ జూపిటర్ లోగో, సరికొత్త టెక్ట్స్ బ్లూ కలర్ తో పాటు ముందు భాగంలో, సైడ్ మిర్రర్స్ పైన క్రోం ఫినిష్ పొందుపరిచారు.