విపణిలోకి ఫోర్డ్‌-2019 ఎండీవర్‌

By rajesh yFirst Published Feb 23, 2019, 12:52 PM IST
Highlights

అమెరికాలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్.. భారత విపణిలోకి 2019 ఎండీవర్ ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరించింది. మార్కెట్లో దీని ధర రూ.28.19 లక్షల నుంచి మొదలవుతున్నది. 

న్యూఢిల్లీ: అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం ‘ఫోర్డ్’ భారత విపణిలోకి ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌లో అప్‌డేటెడ్‌ 2019 ఎడిషన్‌ కారును కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎస్‌యూవీ మోడల్ కారు ప్రారంభ ధర రూ.28.19 లక్షలు పలుకుతోంది. 2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌, సిక్స్ స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను విడుదల చేసినట్లు ఫోర్డ్‌ తెలిపింది.

2.2 లీటర్‌, 3.2 లీటర్‌ ఇంజన్స్‌, సిక్స్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో ఎండీవర్‌ను తెచ్చినట్లు పేర్కొంది. మూడు ఆప్షన్లతో లభించనున్న ఈ ఎస్‌యూవీ ధర రూ.28.91 లక్షల నుంచి రూ.33.31 లక్షల వరకు పలుకుతుందని తెలిపింది. 2.2 లీటర్ల డీజిల్ టైలానియం మాన్యువల్, టైటానియం ప్లస్ ఆటోమేటిక్, 3.2 లీటర్ల డీజిల్ టైటానియం ప్లస్ ఆటోమేటిక్ మోడళ్లలో కారు అందుబాటులో ఉంటుంది. 

ఫోర్డ్ కొత్త ఎండీవర్‌ను 8-వే పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌తోపాటు 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌తో కొత్త ఎండీవర్‌ను డిజైన్‌ చేసినట్లు పేర్కొంది. ఎండీవర్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ వినియోగదారులను మరింత ఆకట్టుకోవటమే కాక మరిన్ని అడ్వెంచర్లు చేసేలా ప్రోత్సహిస్తుందని ఫోర్డ్‌ ఇండియా ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ మెహరోత్రా తెలిపారు.

ఫోర్డ్ ఎండీవర్ మోడల్ కారులో 2.2 లీటర్లు లేదా 3.2 లీటర్ల సామర్థ్యం గల ఇంజిన్, ఫోర్ సిలిండర్ టీడీసీఐ, 3.2 లీటర్ల ఫైవ్ సిలిండర్ టీడీసీఐ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 2.2 లీటర్ల డీజిల్ సామర్థ్యం గల కారు మోటారు 160 పీఎస్ ఆఫ్ పవర్, 385 ఎన్ఎం టార్చి సామర్థ్యం కలిగి ఉంటాయి. 

ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తోపాటు గత మోడల్ ధరలతో పోలిస్తే ఈ ఎండీవర్ కారు ధర తగ్గించినట్లు ఫోర్ట్ ఇండియా తెలిపింది. భారతీయుల సుసంపన్న వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లనున్నది. నూతన ఫోర్డ్ ఎండీవర్ కారులో పలు మార్పులు చేశారు. న్యూ డిజైన్ ఫ్రంట్ బంపర్, క్రోం ప్లేటెడ్ ట్రేపెజోడల్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్లు, రేర్ అండ్ ఫ్రంట్ బంపర్లు, పడిల్ ల్యాంప్స్ తదితర ఫీచర్లు చేర్చారు. 

అంతేకాదు 2.2 లీటర్ల డీజిల్ ఇంధన సామర్థ్యం గల ఇంజిన్ వాడకంతో 14.2 కిలోమీటర్స్ ఫర్ లీటర్ (కేఎంపీఎల్) ఈ సెగ్మెంట్ బెస్ట్ కారుగా ఫోర్డ్ ఎండీవర్ నిలువనున్నది. అయితే ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ మోడల్ కారులో ఇంధన వాడకంలో 12.62 కేఎంపీఎల్‌తో బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ మోడల్ కారుగా నిలువనున్నది. 
 

click me!
Last Updated Feb 23, 2019, 12:52 PM IST
click me!