ఎంఎఫ్ హుస్సేన్‌తో సహా వింటేజ్ కార్ల వేలం: రూ.2.45 కోట్ల ఆస్తి జప్తు

By rajesh yFirst Published Nov 21, 2018, 1:17 PM IST
Highlights

ముంబైలోని అస్టగురు అనే యాక్షన్ సంస్థ 10 వింటేజ్ కార్ల కొనుగోలుకు ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టింది. వాటి ధర రూ.2.5 కోట్లుగా ఉంటుందని అంచనా. ప్రముఖ కళాకారుడు ఎంఎఫ్ హుస్సేన్ సొంత కారు కూడా వీటిల్లో ఉంది. 

ముంబై: మహారాష్ట్ర రాజదాని ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఆక్సన్ హౌస్ ‘అస్టగురు’ తొలి రోజు నిర్వహించిన ఆన్‌లైన్ ఆక్షన్‌లో 10 వింటేజ్ కార్లు అమ్ముడయ్యాయి. మరో రెండు బిడ్ల వేలం కూడా నిర్వహిస్తారు. తొలిరోజు వేలంలో 10 కార్లకు మొత్తం రూ.2.46 కోట్లు లభించాయి. అస్టగురు వేలం వేస్తున్న కార్లలో ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ కారు కూడా ఉంది. 

1947 నాటి రాల్స్ రాయిస్, 1960 నాటి అంబసిడార్ తదితర కార్లు కలిపి రూ.2.46 కోట్లు పలికాయి. ఇంకా 1937 నాటి మొర్రిస్, 1969లో వోక్స్ వ్యాగన్ మోడల్ బీట్లె, రోల్స్ రాయిస్ కారు ఒకటి మంగళవారం సాయంత్రం వేలం వేయనున్నారు. మొర్రిస్, బీట్లే ధరలను రూ.8 లక్షలుగా, రూ.18 లక్షలుగా నిర్ణయించారు. కానీ రోల్స్ రాయిస్ మోడల్ కారు మరీ దారుణంగా రూ.80 లక్షలని నిర్దేశించడంతో కొనేందుకు ముందుకు వస్తారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇంకా 1956 డాడ్జే, కింగ్స్ వే, 1951 మెర్సిడెస్ బెంజ్ 170వీ, 1951 చెవర్లెట్ స్టైల్ లైన్ డీలక్స్ మోడల్ కార్లు కూడా వేలం వేయనున్నారు. ఈ కార్లు నలుగురు వేర్వేరు ఓనర్లవి. వాటిలో ఒకటి మరణించిన పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ అభిరుచితో కొనుక్కున్న మెర్రిస్ ఎయిట్ కారు కూడా ఉంది. దాన్ని ఆయన 27 సంవత్సరాల పాటు వాడారు. కనుక కస్టమర్లు  ఆసక్తి ఉంటే కంపెనీ వెబ్ సైట్లలోకి గానీ,మొబైల్ యాప్ లోకి గానీ వెళ్లి బిడ్ దాఖలు చేయొచ్చు. 

ప్రతిభలో భారత్ స్థానం 53వ స్థానం.. టాప్ లో స్విట్జర్లాండ్
అంతర్జాతీయ ‘వ్యాపార సానుకూలత’లో దూసుకుపోతున్న భారత్‌ ప్రతిభా పాటవాల(టాలెంట్‌) జాబితాలో మాత్రం వెనుకబడుతోంది. దాదాపు 63 దేశాలతో స్విట్జర్లాండ్‌కు చెందిన ఐఎండీ బిజినెస్‌ స్కూల్‌ రూపొందించిన గ్లోబల్‌ యాన్యువల్‌ టాలెంట్‌ తాజా జాబితాలో భారత్‌కు 53వ ర్యాంక్‌ దక్కింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మన దేశ ర్యాంకింగ్‌ రెండు స్థానాలు పడిపోయింది. విద్యా వ్యవస్థలో నాణ్యత కొరవడడం, విద్యా రంగంపై ప్రభుత్వ పెట్టుబడులు తగ్గడం ఇందుకు ప్రధాన కారణమని ఐఎండీ బిజినెస్‌ స్కూల్‌ పేర్కొంది. ఈ సంవత్సరం కూడా గ్లోబల్‌ యాన్యువల్‌ టాలెంట్‌ జాబితాలో స్విట్జర్లాండ్‌ మొదటి స్థానం దక్కించుకుంది. గత ఐదేళ్లుగా స్విట్జర్లాండ్‌ ఈ స్థానంలో కొనసాగుతోంది.

click me!