today astrology:09 సెప్టెంబర్ 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 7, 2020, 7:11 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన మార్పు ఉంటుంది. ఆన్ లైన్ వర్క్ లో మీకు అనుకూలంగా ఉంటుంది. సహచరులు, మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries): ఈ రోజు  సమాజంలో శుభకరమైన వ్యయం మీ కీర్తిని పెంచుతుంది. ప్రతి ఒక్కరి ప్రేమ, మద్దతు కుటుంబంలో కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి గౌరవం లేదా లబ్ది పొందుతారు. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. భౌతిక సంతోషం కలుగుతుంది. ఏవైన శుభకరమైన కార్యక్రమాలకు కుటుంబ సహకారం ఉంటుంది.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభ రాశి (Taurus): ఈ రోజు కుటుంబంలో సంతోషకరమైన మార్పు ఉంటుంది. ఆన్ లైన్ వర్క్ లో మీకు అనుకూలంగా ఉంటుంది. సహచరులు, మిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది. నూతన కార్యక్రమాలపై దృష్టిపెడతారు. చట్టపరైన వివాదాలకు వీలైనంత వరకు దూరంగా ఉంటే మంచిది. లేకుంటే ఇది చాలా దూరం వెళ్తుంది. ఆన్ లైన్ పోటీల్లో విజయం సాధించే అవకాశముంది. స్థానచలనం వల్ల విజయాన్ని సాధిస్తారు. సమస్యలు ఉన్నప్పటికీ తగిన గ్రహ శక్తి పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధున రాశి (Gemini): ఈ రోజు కొత్త వ్యాపార ప్రణాళికలు గుర్తుకువస్తాయి. మీరు ఎంచుకున్న రంగంలో మీపై అదికారుల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నించండి. మీకు ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. కళాత్మకమైన పని చేయడానికి రోజులు గడపవచ్చు. మీకు బాగా నచ్చిన పనిని పూర్తి చేస్తారు. మీ మనస్సు కూడా సంతోషంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటక రాశి (Cancer): ఈ రోజు ఎంతో సృజనాత్మకంగా ఉంటుంది. ఏ పని అయినా అంకితభావంతో పూర్తి చేస్తారు. ఇదే సమయంలో నేడు అసంపూర్తిగా ఉన్న వ్యాపార పనులు, వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ముఖ్యమైన చర్చలు జరుగుతాయి. ఈ రోజు కార్యాలయం తెరిచి ఉంటే మీ ఆలోచనల ప్రకారం మీరు వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇందుకు మీ భాగస్వాములు కూడా సహకరిస్తారు. స్నేహితుల సాయంతో మీరు ఈ రోజు పెద్ద పని ప్రారంభించవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహ రాశి (Leo): ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. రోజంతా మీరు తీరిక లేకుండా గడుపుతారు. మతం, ఆధ్యాత్మిక, విద్య లాంటి విషయాల్లో కొంత సమయం తీసుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో మీపై అధికారుల నుంచి ఆటంకాలు ఎదురవుతాయి. విష్ణుమూర్తిని ఆరాధిస్తే అంతా మంచే జరుగుతుంది. ఫలితంగా మీ ప్రత్యర్థులకు ఆందోళన కలుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యా రాశి (Virgo): ఈ రోజు మీ అదృష్టాన్ని విశ్వసించండి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకుండా ఉండండి. పరిస్థితి అంతా సద్దుమణిగి అనుకూలంగా ఉంటుంది. వార్తా వ్యవహారాలకు సంబంధించి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. మీ చుట్టుపక్క వ్యక్తులతో ఘర్షణలు రాకుండా చూసుకోండి. కొన్ని శుభకరమైన పనులు గురించి ఆలోచన చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలకునేవారిరి ఇదే సరైన సమయం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

తులా రాశి (Libra): ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రవర్తనకు సంబంధించి అన్ని వివాదాలను పరిష్కరించవచ్చు.  పనిలో మార్పు వచ్చే అవకాశముంది. మీరు వ్యాపారాన్ని మార్చడం లేదా విస్తరించడం లాంటి వాటి గురించి ఆలోచించవచ్చు. రియల్ ఎస్టేటు, కుటుంబం విషయాల్లో చుట్టుపక్కల వారి గురించి పట్టించుకోవద్దు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. నూతన ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు ప్రారంభిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృశ్చిక రాశి (Scorpio): ఈ రోజు ఉద్యోగం లేదా వ్యాపారంలో నూతన ఆవిష్కరణలను తీసుకురాగలిగితే భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు ఉంటాయి. తండ్రి వైపు నుంచి ప్రయోజనం ఉంటుంది. అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో నూతన పోటీలను, సవాళ్లను ఎదుర్కొంటారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. కార్యశీలలుగా ఉండేందుకు ప్రయత్నించండి. కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సు రాశి (Sagittarius): ఈ రోజు కుటుంబంతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. కోపాన్ని నియంత్రించడం ముఖ్యం. నేడు స్తబ్దుగా ఉంటుంది. అయితే ఆర్థికం బలంగా ఉండే అవకాశముంది. వ్యాపారంలో కొద్దిగా రిస్క్ తీసుకున్నట్లయితే లాభం ఎక్కువగా వస్తుందనే ఆశ మీకు ఉంది. రోజువారీ పనులతో పాటు కొత్త పనులు చేయడానికి ప్రయత్నించండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అయితే వాటిని గుర్తించుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకర రాశి (Capricorn): ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఈ రోజు మీ ప్రతిష్ఠ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రతి ఒక్కరి మద్దతు బాగుటుంది. అనవసర ప్రయాణాల్లో మానుకోండి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. వాతావరణ మార్పులు సమశీతోష్ణ రుగ్మతలు తలెత్తుతాయి. ఆహారం, పానీయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండకండి. వ్యాపార పరంగా ఈ రోజు ఆహ్లదకరమైన సమయం. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

కుంభ రాశి (Aquarius): ఈ రోజు నిజాయితీని కలిగి ఉండండి. అనేక రకాల పనులను చేయడం ఆందోళనను పెంచుతుంది. ప్రత్యర్థులను కొంతమందిని కలవరపెట్టడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీని కలిగి ఉండండి. అనేక రకాల పనులను చేయడం ఆందోళనను పెంచుతుంది. ప్రత్యర్థులను కొంతమందిని కలవరపెట్టడానికి ప్రయత్నిస్తారు. భాగస్వామ్య వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. రోజు వారీ ఇంటి పనులను నిర్వహించడానికి నేడు మంచి అవకాశం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీన రాశి (Pisces): ఈ రోజు మీ తెలివితేటలను ఉపయోగించడం ద్వారా అన్నింటినీ పొందవచ్చు. ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. సహనం మీ మృదువైన ప్రవర్తనతో సమస్యలను సరిదిద్దవచ్చు. ఈ రోజు ఖర్చు మీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలకు డబ్బు వృధాగా ఖర్చవుతుంది. మీ కుటుంబం ఆనందం కోసం సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తారు. మీరు చేయగలిగిన దాన్ని బాగా చేయడానికి ప్రయత్నిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

click me!