today astrology: 06 సెప్టెంబర్ 2020 ఆదివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 6, 2020, 7:34 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన భాగస్వాములను పొందుతారు. సంపదతో పాటు పేరు ప్రతిష్ఠలను కూడా పొందుతారు. అనుకూలమైన గ్రహాల కారణంగా రోజంతా శుభప్రదంగా ఉంటుంది.


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు చేపట్టిన పని, ప్రారంభించిన వ్యవహారాన్ని జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఏదోక అంశంలో లోపం ఉండే అవకాశముంది. పనులతో బిజీగా ఉంటారు. పనుల్లో తీరిక లేకుండా గడుపుతారు. ప్రత్యేకమైన కార్యక్రమం చేసేందుకు మీరు ఈ రోజు ఎంతో ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ఈ రోజు సమాజం పట్ల మీ వైఖరిలో కొన్ని మార్పులు చూడవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపార రంగంలో ఉన్నవారికి నూతన భాగస్వాములను పొందుతారు. సంపదతో పాటు పేరు ప్రతిష్ఠలను కూడా పొందుతారు. అనుకూలమైన గ్రహాల కారణంగా రోజంతా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయినా సరే ఇది మీ విలువను పెంచుతుంది.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు వ్యవహారంలో అంతగా అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా అవసరం. ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంటుంది. అంటే గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని అతిథులు ఇంటికి వచ్చి ఎక్కువ రోజులు ఉంటారు. ఫలితంగా మీ ఖర్చులు పెరుగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం పెరిగే కొద్ది సృజనాత్మకత పెరుగుతుంది. అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ సంపదను ఆర్జించే సూచనలు సూచిస్తున్నాయి. ఈ యోగం వల్ల ఆగిపోయిన పనులు, వ్యవహారాలు ఈ రోజు పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ఎంతో సరదాగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా శుభవార్తలు వింటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వ్యాపార వెత్తలు లాభాలు అందుకుంటారు. నిజమైన నిజాయితీ ద్వారా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. పని ప్రదేశంలో పెరుగుదల సూచిస్తుంది. అంటే నేడు కార్యక్షేత్రంలో బాగా రాణిస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి గౌరవం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఉద్యోగం లేదా వ్యాపార రంగంలో మౌనంగా ఉండటం ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వీలైనంత వరకు వాదానలు లేదా సంఘర్షణలను నివారిస్తే మంచిది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. మీరు మతపరమైన పనిలో తీరిక లేకుండా ఉంటారు. అంటే భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. మనసులో పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మనసు మాట వినాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు సన్నిహితులు, మిత్రుల సలహాతో పనులను సక్రమంగా చేయవచ్చు. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. డబ్బును వ్యవహారంలో అనేక పనులు, వ్యవహారాలను సులభతరం చేస్తుంది. కష్టపడి పనిచేసి వాటి ఫలాలను అందుకుంటారు. నూతన పని, వ్యవహారంలో లాభం పొందుతారు. సంతోషకరంగా సమయాన్ని గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా సలహాతో కూడా ముందుకు సాగవచ్చు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇతరుల సాయంతో మీకు నేడు ఎక్కువ లాభాన్ని అందుకుంటారు. రోజంతా శుభప్రదంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బు సంప్రాప్తిస్తుంది. విద్యా విషయంలో విద్యార్థులు శుభవార్తలు వింటారు. స్నేహితుల నుంచి మంచి విషయాలు వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుకొనవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఈ సమయంలో మీరు ఎంతో తీరిక లేకుండా గడుపుతారు. స్నేహితుల సహకారం మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది. పనులతో బిజీగా ఉన్నట్లు సూచిస్తుంది. మీ ప్రాధాన్యత వాణిజ్య వ్యాపారంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మీరు చెల్లాచెదురుగా ఉన్న వస్తువులను సరిచేయడానికి ప్రయత్నించవచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు  ఒక విషయంలో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. ధనం, కీర్తి కూడా పెరుగుతాయి. స్నేహితులు, సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది. తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేస్తారు. మీ శత్రువులు నష్టపోతారు. అంతేకాకుండా కుటుంబంలో ఆనందం ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మంగళకరమైన విధులు నిర్వహించవచ్చు. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపిస్తారు. ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. పూర్తి ప్రయోజనం ఉంటుంది. బంధువులు నుంచి గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. కుటుంబంతో కొంత సమయం గడపడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

 


 

click me!