ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో సహచరులు, అధికారులతో విభేదాలు వచ్చే అవకాశముంది.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇంతకు ముందు మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మీకు ప్రయోజనం లభిస్తుంది. అతిథుల రాక ఉంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది. మీరు వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. అంతేకాకుండా ఆగిపోయిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మధ్యాహ్నం తర్వాత ఆఫీసులో కొంత గందరగోళ పరిస్థితి ఉండవచ్చు. సాయంత్రం ప్రణాళికబద్ధమైన పనులు పూర్తవుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కార్యాలయంలో సహచరులు, అధికారులతో విభేదాలు వచ్చే అవకాశముంది. అయితే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరముండదు. ఇంట్లో వాడుకునేందుకు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఫలితంగా వ్యయం పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. మనస్సు విచారంగా ఉంటుంది. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. రాజకీయాల్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. మంచి పనులు చేయడం వల్ల మీ యోగ్యత పెరిగి పరిపూర్ణత పొందుతారు. సాయంత్రం శుభప్రదమైన కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యాపారంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు ఉంటుంది. మంచి పనులు చేసినట్లు అనిపిస్తుంది. వ్యాపారస్తులకు నేడు కలిసి వస్తుంది. పనులు పూర్తయిన తర్వాత మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. మీకు ప్రయోజనం చేకూరుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రజల మనస్సులో మీ కీర్తి మరింత పెరుగుతుంది. ఒప్పందం గురించి చర్చ ఉన్నట్లయితే దాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఆపై నిర్ణయం తీసుకోవడం మంచిది. పదోన్నతి పొందడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో మీ పురోగతిని చూసి సహోద్యోగులు కలత చెందుతారు. మీ పని పట్ల మీ నిబద్ధత కార్యసిద్ధి ద్వారా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు సానుకూల ఫలితాలున్నాయి. మీ ఆలోచనలకు సంబంధించి కార్యాలు పూర్తవుతాయి. మీరు సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. విదేశాల్లో నివసిస్తున్న బంధువులు నుంచి శుభవార్త అందుకుంటారు. సాయంత్రం ప్రముఖులను కలిసే అవకాశముంది. పాత స్నేహితులను కలుస్తారు. శుభప్రదమైన కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ సౌకర్యాలు పెరుగుతాయి. అంతేకాకుండా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపార ప్రయత్నాలు వృద్ధి చెందుతాయి. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమ, మద్దతు లభిస్తుంది. మీరు సంతోషంగా ఉంటారు. సాయంత్రం మీకిష్టమైన వస్తువును కోల్పోయే అవకాశముంది. వీలైనంతవరకు రుణాలు ఎవ్వరికీ ఇవ్వకండి. రుణం తీసుకోకండి. ఎందుకంటే ఈ రెండు విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు శుభప్రదంగా ప్రారంభమవుతుంది. సేవాకార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చిస్తారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు ఆత్మ సంతృప్తిని పొందుతారు. మరే ఇతర ప్రాపంచిక ఆనందంతో పోల్చలేం. మీకు కొంతమంది సహోద్యోగులపై అసూయ కలిగించవచ్చు. భగవంతుడిని భక్తితో ఆరాధించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు మృదువైన ప్రవర్తనతో వాతావరణాన్ని తేలికపరచగలుగుతారు. అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల కారణంగా మీరు కలత చెందుతారు. ఈ సమయంలో సహనంతో ఉండాలి. మీ ప్రాజెక్టులకు ఆటంకాలు ఎదురవుతాయి. రాత్రి సమయం ఎంతో వినోదభరితంగా గడుపుతారు. స్నేహితుల రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు అసంపూర్ణంగా ఉన్న పనులు ఈ రోజు పూర్తవుతాయి. ఇంట్లో ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు కలత చెందవచ్చు. కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఆందోళన కలుగుతుంది. స్నేహంలో ఏదైనా ప్రత్యేక పథకంలో భాగం కాకండి. ప్రమాదకర కార్యకలపాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సలహాతో పని పూర్తి చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధించడం ద్వారా ఆనందంగా ఉంటుంది. చేతిలో పెద్ద మొత్తంలో డబ్బు ఉండటం వల్ల కొత్త రెక్కలు వస్తాయి. జీవిత భాగస్వామితో విభేదాలు ముగుస్తుంది. ఇంటి మరమ్మతుల గురించి ఆలోచించవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు అందుకుంటారు. సంతానం నుంచి సంతృప్తి పొందుతారు. ఇప్పుడే కెరీర్ ను ప్రారంభించిన యువకులకు ఈ రోజు తమ కార్యాలయాల్లో ప్రతిభను చూపించే అవకాశం లభిస్తుంది. ఈ రంగంలో ఖ్యాతి పెరుగుతుంది. సాయంత్రం సమయం మిత్రులతో ప్రశాంతంగా గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.