ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఖర్చులు పెరిగిన అవసరాలు వల్ల స్వల్ప ఇబ్బందులు తప్పవు. వ్యాపారులకు పురోభివృద్ధి. అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం మిత్రులు మీ యత్నాలకు అండగా నిలుస్తారు. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషరాశి ( Taurus) వారికి :- ఈ రోజు పాత మిత్రుల కలయికతో మీకెంతో సంతృప్తినిస్తుంది. విద్యార్థులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. షాపింగ్ వ్యవహారాలు, దూర ప్రయాణాల్లో మెళకువ వహించండి. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు భాగస్వాముల మధ్య విభేదాలు సృష్టించేవారు అధికం అవుతున్నారని గమనించండి. నూతన వ్యాపారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పరోపకారానికి పోయి సమస్యలకు గురికాకండి. దైవ, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా తట్టుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం ఖర్చు చేస్తారు. మీకు దగ్గరగా ఉన్న మీకే తెలియని ఒక అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. గృహ మార్పుతో ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. జీవితభాగస్వామి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా కలిసివస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. నిరుద్యోగులకు ప్రముఖుల సిఫార్సులతో సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. రావలిసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఖర్చులు అధికమవుతాయి. కటుంబ సమస్యల నుంచి బయటపడతారు. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. ముఖ్యులకు విలువైన కానుకలు ఇచ్చి ఆదరణ పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీ ముఖ్యుల కోసం ధనం బాగా వెచ్చించవలసి ఉంటుంది. తొందపడి వాగ్ధానాలు చేసి సమస్యలకు గురికాకండి. మీకు రాబోయే ఆదాయానికి తగినట్టుగా ఖర్చులు సిద్ధమవుతుంది. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాల్లో మాటపడాల్సి వస్తుంది. వ్యాపారులకు శుభదాకయం. కొంత ఆలస్యంగానైనా చేపట్టిన పనులలో సంతృప్తికానవస్తుంది. మీ మాటలు, ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త. ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం బాగా పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు జీవితభాగస్వామి ప్రోద్భలంతో కొత్త ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇతరుల విషయాలలో అతిగా వ్యవహరించడం వల్ల అభాసుపాలయ్యే ఆస్కారముంది. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయుల క్షేమసమాచారాలు ఊరట కలిగిస్తాయి. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమైంది. ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదముంది. జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో ఎదుటివారి వేషధారణ చూసి మోసపోయే ఆస్కారం ఉంది. భార్యాభర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాలు వెళ్లటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశం ఉంది. మీరు ఓ స్నేహితునితో కలిసి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.