ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. హెచ్చుతగ్గులు ఉంటాయి. పని ప్రదేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మీ సొంత పనిలో సమస్యలు తలెత్తే అవకాశముంది.
వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు,
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151
గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.
మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు బంధువుల మద్దతు లభిస్తుంది. సానుకూల ఫలితాలుంటాయి. మీ కంటే పెద్దవారి మద్దతు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి సాయం చేసే స్నేహితులున్నారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. షాపింగ్ చేస్తూ సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) వారికి :- ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. హెచ్చుతగ్గులు ఉంటాయి. పని ప్రదేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల మీ సొంత పనిలో సమస్యలు తలెత్తే అవకాశముంది. పనిలో జాగ్రత్త వహించండి. మీ తెలివితేటలతో ప్రత్యర్థులను ఓడించగలుగుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు కుటుంబ జీవితంలో మనస్సు ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. మీ పనితీరుతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువ ఆలోచనలు సాగిస్తారు. మనస్సు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. చాలా కాలం తర్వాత ఈ విధంగా ఆలోచనలతో సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు నూతన ప్రణాళిక సిద్ధం చేయడానికి మంచి అవకాశం పొందుతారు. ఆర్థిక విషయాల్లో ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్య, గృహవసరాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగంలో మీరు తీరిక లేకుండా గడుపుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మేనెజ్ మెంట్ రంగంలో ఉన్నవారికి కలిసి వస్తుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) వారికి :- ఈ రోజు విజ్ఞానశాస్త్రం ప్రకారం నేర్చుకోవడానికి ఆసక్తి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సాయంత్రం విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలకు కలిసి వస్తుంది. అదృష్టం మీకు పూర్తిగా మద్దతు ఇస్తుంది. మీరు డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు దాని కోసం ముందుకు వెళ్లవచ్చు. విద్యార్థులు చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు కుటుంబంలో సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. సరైన పనులు, వ్యవహారాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ప్రేమ సంబంధాల్లో మూలధనాన్ని పెంచుతాయి. ప్రాపంచీక ఆలోచనల నుంచి బయటకు వస్తారు. వాస్తవికతను అర్థం చేసుకోవాలి. ఇది మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో లాభం అందుకుంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు నూతన విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సహాయం పొందగలుగుతారు. జీవితంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఇబ్బందుల తర్వాత మీరు ధైర్యం ఎదుర్కొంటారు. మీ తెలివితేటలతో మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తారు. ప్రేమ వ్యవహారంలో సహనంతో వ్యవహరించాలి. లేకపోత భాగస్వామి మానసికి స్థితి క్షీణిస్తుంది. మీ వాక్చాతుర్యంపై నియంత్రణ కలిగి ఉంటే ఇది ఎవరికైనా చెప్పవచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీ జీవిత భాగస్వామికి మీ మద్దతు లభిస్తుంది. వారికి సహాయం చేస్తారు. పిల్లల విద్యపై దృష్టి పెట్టాలి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. బద్ధకంగా ఉంటారు. శరీర అలసట చెందుతుంది. నొప్పి అనుభూతి చెందుతుంది. మీరు అనవసర ఖర్చులు చేస్తారు. బడ్జెట్ గురించి ఆందోళన చెందుతారు. ఆహార నియమాలను జాగ్రత్తగా పాటించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ రోజు మార్కెటింగ్ రంగంలో ప్రయోజనకరంగా ఉంటుంది. సాత్విక, తాత్విక మనోభావాలతో గడిచిపోతుంది. ప్రేమికుడితో సంబంధం బాగుంటుంది. వివాహిత జీవితంలో ప్రేమ, ఆనందం లభిస్తుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీపై అధికారుల నుంచి ఉద్యోగంలో సహకారం లభిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు పోత్సాహాన్ని పొందవచ్చు. కుటుంబ జీవితంలో మానసిక ప్రశాంతత పొందుతారు. వాతావరణం ఆహ్లదకరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఈ రోజు ప్రోత్సహకరంగా, ఉత్తేజకరంగా ఉంటుంది. పిల్లల నుంచి ఆనందం పొందుతారు. మీరు మీ పని నుంచి అధికారుల ప్రశంసలు పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.
కుంభరాశి ( Aquarius) వారికి :- ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండండి. నూతన పనిని ప్రారంభించకూడదు. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఏదైనా పరిచయస్తుడి నుంచి విడిపోవచ్చు. పిల్లలు విద్య నుంచి అవసరాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు కుటుంబంలో పరస్ఫర మద్దతు లభిస్తుంది. తక్కువ దూరం ప్రయాణించవచ్చు. దూరంగా ఉన్న స్నేహితులను సంప్రదించవచ్చు. వీలైనంత వరకు సమాచారం, ప్రయత్నాల్లో విజయం ఆనందంగా ఉంటుంది. మీకు సానుకూలంగా ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో పురోగతి ఉంటుంది. మీరు గౌరవంతో పాటు కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.