today horoscope: 24 సెప్టెంబర్ 2020 గురువారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 24, 2020, 7:05 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మంచి మనస్సుతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. అష్టమంలో చంద్ర దోషం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇష్టదేవతా స్తోత్రం చదివితే బాగుంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు శుభప్రదమైన కాలం నడుస్తోంది. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. సమర్ధంగా బాధ్యతలను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. ఇష్టదేవతా ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు చేపట్టే పనిలో ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. మానసిక అశాంతి ఉంటుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని వదలకండి. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మిశ్రమకాలం. సొంత నిర్ణయాలు పనిచేయవు. సంకుచిత విమర్శలను పట్టించుకోకండి. మంచి ఆలోచనావిధానంతో ముందుకు సాగండి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు శ్రమ అధికం అవుతుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. మనసు పెట్టి పని చేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు విశేషమైన శుభఫలితాలు ఉన్నాయి. శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలు పొందుతారు. అవసరమైన వాటిపై దృష్టి సంకల్పసిద్ధి ఉంది. ఇష్ట దైవారాధన శుభం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు తప్పవు. అధికారులను ప్రసన్నం చేసుకునేలా ముందుకు సాగండి. క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మనోధైర్యంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు పొందుతారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు శ్రమ పెరుగుతుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. ఆర్థికాంశాల్లో జాగ్రత్త. ఒక వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విష్ణు అష్టోత్తర శతనామావళి చదివితే  సమస్యలు తొలగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!