today astrology: 24 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Aug 24, 2020, 7:06 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. వాయిదాల మీద వాయిదా పడుతున్న కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  పనిచేస్తున్న రంగంలో కీర్తి పెరుగుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు మెచ్చుకుంటారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేవి ఏర్పడవు. సంతానానికి సంగీత, సాహిత్యాల్లో ప్రవేశం కల్పించాలని నిశ్చయించుకుంటారు.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమష్టి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ పెరుగుతుంది. కొన్ని వార్తలు ఇబ్బంది కలిగిస్తాయి. వాయిదాల మీద వాయిదా పడుతున్న కార్యక్రమాలను సానుకూల పరచుకుంటారు. చిరుతిండ్లకు ప్రాముఖ్యతనిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు  మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలపై ఈ రోజు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. చేపట్టే పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ పరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పాత రుణాలు వసూలవుతాయి.పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  ధైర్యంతో చేసే కొన్ని పనులు గొప్ప లాభాలను అందిస్తాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ధన వ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. చిన్నపాటి ప్రయాణాలు సాగిస్తారు. గతానుభవం నేడు ఉపకరిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. స్థిరాస్తులకు సంబంధించి అంశాలు సానుకూల పడతాయి. రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్ముతారు. కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు వీలైనంతవరకు వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాంకేతిక కారణాల వల్ల అపార్థాలు చోటు చేసుకుంటాయి. బాల్య మిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్ పరంగా లాభపడే సూచనలు లేవు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు ముఖ పరిచయస్థుల నుంచి మాట సహాయాన్ని తీసుకుంటారు. సమయోచితంగా వ్యవహరిస్తారు. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మనోధైర్యంతో ముందుకు సాగాలి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాల వల్ల లాభపడతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులేవి ఏర్పడవు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆహార, ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు వద్దు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఆలోచింప జేస్తాయి. సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. ఆప్తులెవరో మిత్రులెవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దైవదర్శనం చేసుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. ఓ వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. గతంలో దూరమైన ఓ వర్గంతో తిరిగి నేడు సఖ్యత ఏర్పడుతుంది. గుప్తదానం చేస్తారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు పట్టుదలతో చేసే మంచి పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. దైవబలం ఉంది. దూరభ్యాసాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుంటారు. వివాదాల్లోకి మిమ్మల్ని లాగాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ ప్రణాళిక కార్యచరణ సత్ఫలితాలనిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆదాయ, వ్యయాల్లో సమతూల్యతను సాధించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!