today horoscope:17 సెప్టెంబర్ 2020 గురువారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 17, 2020, 7:08 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓరాశివారికి కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. మానసిక ఆనందం పొందుతారు. మీకిష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఫలితంగా మానసిక ప్రశాంతత పొందుతారు.  


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు తమ తెలివితేటలను ఉపయోగించి మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఏదైనా కీలక సమాచారాన్ని అందుకుంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవబలం అండగా ఉంటుంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు మధ్యమ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు పనికిరావు. అలసట పెరగకుండా చూసుకోవాలి. మానసిక ఆనందం పొందుతారు. మీకిష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఫలితంగా మానసిక ప్రశాంతత పొందుతారు.  వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది.పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఏ పని లేదా వ్యవహారం ప్రారంభించిన సులభంగా పూర్తి చేస్తారు. వ్యర్థమైన పనులతో సమయాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్త వహించండి. వీలైనంతవరకు ఖర్చు తగ్గించడం మంచిది. ఆస్తి లేదా విలువైన వస్తువుల కొనుగోలుకు ముందు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో క్షుణ్నంగా పరిశీలించాలి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. విజయం, కీర్తిని పెంచుకుంటారు. మీ శక్తి పెరుగుదల వల్ల శత్రువుల మనోధైర్యం తగ్గుతుంది. కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇతరుల నుంచి సహాయం అందుకోవడం ద్వారా ఓదార్పువస్తుంది. వీలైనంతవరకు ఇతరులక సహాయం చేయడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మనోధైర్యం విశేషంగా ఉంది. ప్రాపంచీక ఆనందాలు పొందుతారు. సమాజంలో గౌరవంతో పాటు మర్యాద లభిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. పాత స్నేహితులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతారు. ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఉంచండి. ఇది మీ అన్ని పనులను సులభంగా పూర్తి చేస్తుంది. ఇది మనస్సులను తేలికగా ఉంచుతుంది. ఇంటి సమస్యలు చిటికెలో పరిష్కరించుకోగలుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారంలో వ్యక్తిగత విషయాలను తీసుకురావడం వల్ల సమస్యలు కలుగుతాయి. మీ ప్రేమికులతో ఏదైనా సమస్యుంటే చర్చించి పరిష్కరించుకోవాలి. మీ సంబంధాన్ని తర్వాతి స్థాయికి తీసుకెళ్లే ముందుకు బాగా ఆలోచించుకోవాలి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు ఫలిస్తాయి. తోటివారి ఆదరణ పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా వారి నుంచి మీరు ప్రయోజనం పొందుతారు. విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. తద్వారా విద్యారంగంలో పరాజయం ఎదురుకాదు. ఎవ్వరితోనూ విరోధాలు పెంచుకోకండి. కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు మీ చేతిలో పరాజయం పాలవుతారు. మీ కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. రాజకీయ నాయకుల మద్దతు మీకుంటుంది. తొందరపడి మాట జారకుండా సంయమనంతో వ్యవహరించాలి. లావాదేవీలతో జాగ్రత్త వహించండి, లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశముంది. ప్రయాణాల్లో వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.   పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మహిళా స్నేహితులను అకస్మాత్తుగా కలుస్తారు. ఉపాధి దిశలో కూడా విజయం ఉంటుంది. అవాంఛిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మీకిష్టమైనవారికి కలిసే అవకాశముంది. నిపుణుల సలహా మేరకు ప్రభుత్వ సంబంధిత పనుల్లో పెట్టుబడి పెట్టండి. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. ఒక వ్యవహారంలో శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.   కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు అనుకోకుండా ధనప్రాప్తి ఉంటుంది. మీ జీవన శైలి, మృదువైన ప్రవర్తన నుంచి ప్రయోజనం అందుకుంటారు. ఇతరుల నుంచి మద్దతు పొందుతారు. సమీప ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది, ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ విజయాన్ని అందుకుంటారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక లేక సామాజిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. తండ్రి, అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా  కొంచెం అలసటగా పొందే అవకాశం ఉంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సౌభాగ్యసిద్ధి ఉంది. విశ్వకర్మ భగవానుని ప్రార్థన చేయడం ద్వారా శుభఫలితాలు పొందుతారు.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 

click me!