today astrology: 17 ఆగస్టు 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Aug 17, 2020, 7:13 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుకుంటారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది


డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Latest Videos

గమనిక :- ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి , షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు జైశ్రీమన్నారాయణ. 

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు తొలుగుతాయి. సంఘసేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఊహించని విధంగా ధనలాభం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయం అందుకుంటారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు నూతన మిత్రులు పరిచయమైన మాట సహాయం అందిస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. రుణ ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. శుభకాలం మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. అనుకోని అతిథులను కలిసి ఉల్లాసంగా సమయాన్ని గడుపుతారు. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. సహనం కోల్పోరాదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు  కుటుంబ సౌఖ్యం ఉంది. ఆర్థికంగా మేలైన సమయం. వృత్తి, వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబంలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. మిత్రుల నుంచి విలువైన సమచారం అందుకుంటారు. విందు, వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. వాహనయోగం పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యరాశి ( Virgo) వారికి :- ఈ రోజు ధన, వస్తు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో సకాలంలో పూర్తి చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో ఆదరణం లభిస్తుంది. కీలక నిర్ణయాల్లో స్వంత ఆలోచనలు మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాల్లో నిదానం అవసరం. ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి చేకూరుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సన్నిహితులతో ఏర్పడిన తగాదాలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి. అవసరానికి తగిన సహకారం అందుకుంది. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చేపట్టిన పనుల్లో శుభఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన విషయాలను గ్రహిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచన ఉంటుంది. బంధుమిత్రులను కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు, విరోధాలు తొలుగుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మెలకువ అవసరం. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!