today astrology: 17 ఏప్రిల్ 2020 శుక్రవారం రాశిఫలాలు

By telugu news teamFirst Published Apr 17, 2020, 7:03 AM IST
Highlights
ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విశాల భావాలు ఏర్పడతాయి. ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. న్యాయ అన్యాయాల విచారణ చేస్తారు. మొత్తం పైన తృప్తి తక్కువగా ఉంటుంది. అన్ని పనుల్లో లోపాలు పెరుగుతాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.


డా. ఎస్‌. ప్రతిభ
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సంఘంలో గౌరవం కోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలపై కాంక్ష ఉంటుంది. ఆ ప్రయత్నాలపై దృష్టి ఉంటుంది. శారీరక శ్రమ ఉంటుంది. వృత్తిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికం అవుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. అధికారులతో అనుకూలతకోసం ప్రయత్నం అవసరం.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) :  పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు. విశాల భావాలు ఏర్పడతాయి. ఆలోచనల వల్ల మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. న్యాయ అన్యాయాల విచారణ చేస్తారు. మొత్తం పైన తృప్తి తక్కువగా ఉంటుంది. అన్ని పనుల్లో లోపాలు పెరుగుతాయి. శ్రీ మాత్రేనమః జపం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : చెడు మార్గాలపై దృష్టి ఏర్పడుతుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొంటారు. హాస్పిటల్లకు ఖర్చు చేస్తారు. పరాధీనులౌతారు. శ్రమలేని సంపాదనపైదృష్టి ఏర్పడుతుంది. శ్రమలేని సంపాదన నిరుపయోగం అవుతుంది.  శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు. భాగస్వాములతో అప్రమత్తత అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పలుకుబడికోసం ఆరాట పడతారు. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. ఒత్తిడిని తట్టుకుని నిలబడే ప్రయత్నం చేయాలి. దుర్గా ఆరాధన మేలు చేస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శతృవులపై విజయం సాధిస్తారు. ఏపనైనా పట్టుదలతో కార్యసాధన చేస్తారు. పోటీల్లో శ్రమతో గెలుపు ఉంటుంది. ఋణాలపై దృష్టి ఏర్పడుతుంది. శారీరక శ్రమ అధికం. ఔషధ సేవనం చేస్తారు. రోగనిరోధక శక్తి పెంచుకునే పనులు చేయాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్ర జపం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతానంవల్ల సమస్యలు వచ్చే సూచనలు. క్రియేటివిటీ తగ్గుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో తొందరపాటు పనికిరాదు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు రాకపోవచ్చు.

 తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాలవలన ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల్లో ఆటంకాలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి. ఆహారం వల్ల సమస్యలు వస్తాయి. విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. అన్ని పనుల్లో జాగ్రత్త అవసరం. ఇంటి పనుల విషయంలో తొందరపనికి రాదు

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  తోటి వారి సహకారం లభిస్తుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయడంలో ఒత్తిడి అధికం అవుతుంది. సంతోషం లభిస్తుంది. ప్రచార, ప్రసార సాధనాల్లో లోపాలు ఏర్పడుతాయి. దుర్గా ఆరాధన మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : మధ్యవర్తిత్వాలు పనికి రావు. అనవసర మాటలు మాటలాడరాదు. కుటుంబ సంబంధాలు కాపాడుకునే ప్రయత్నం అవసరం. ప్రయాణాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఉంది. అనవసర ఖర్చులపై దృష్టి ఉంటుంది. దానధర్మాలకు, మంచి పనులకు ఖర్చు చేయడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) :  శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో ఒత్తిడి ఏర్పడుతుంది.  ప్రణాళికల్లో లోపాలు ఏర్పడతాయి. పట్టుదలతో కార్యసాధన అవసరం. నూతన పరిచయాల వల్ల ఆటంకాలు ఉంటాయి. సామాజిక అభివృద్ధి లోపిస్తుంది.  దుర్గా దేవి ఆరాధన మేలు చేస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) :  విశ్రాంతి లోపం లభిస్తుంది. అనవసర ఖర్చులు చేస్తారు.  ఇతరులపై ఆధారపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవుతాయి. సుఖం కోసం ఆలోచిస్తారు.  దుర్గా దేవి ఆరాధన మేలు చేస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఆశయాలకోసం ఆరాటపడతారు. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. స్వార్థంపై దృష్టి ఉంటుంది. సమిష్టి లాభాలకోసం ప్రయత్నం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. రాజకీయాలపై దృష్టి ఉంటుంది. దుర్గాస్తోత్ర పారాయణ చేసుకోవడం మంచిది.
     
click me!