today horoscope: 14 సెప్టెంబర్ 2020 సోమవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 14, 2020, 7:21 AM IST

ఈ రోజు రాశిఫలాలు  ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు కళల రంగంలో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వివాహం చేసుకోవాలనుకునేవారికి మంచి అవకాశాలు లేదా మార్గాలు లభిస్తాయి. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పెండింగ్ పనులు, వ్యవహారాలు పూర్తి చేయాల్సిన సమయానికి పూర్తి చేస్తారు. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు  సమాజంలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా స్నేహితులతో సుదీర్ఘ ప్రయాణంలో వెళ్లవచ్చు. వైవాహిక జీవితంలో తీపి ఉంటుంది. అదే విధంగా ఇంట్లో శుభప్రదంగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలున్నాయి. కార్యాలయంలోని అధికారుల నుంచి మనస్పర్థలు ఎదురవుతాయి. కాబట్టి కోపాన్ని నియంత్రించండి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తండ్రి సహకారంలో అన్ని పనులు, వ్యవహారాలు కలిసి వస్తాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు కళల రంగంలో విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వివాహం చేసుకోవాలనుకునేవారికి మంచి అవకాశాలు లేదా మార్గాలు లభిస్తాయి. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పెండింగ్ పనులు, వ్యవహారాలు పూర్తి చేయాల్సిన సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారం, కార్యాలయంలో మరింత కష్టపడాల్సి వస్తుంది. తద్వారా పని నిరంతరం కొనసాగవచ్చు. ప్రతి పనిలో చిన్న తోబుట్టువులు మద్దతు ఇస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నూతన ప్రణాళికలు వేస్తారు. ప్రేమ, ఉత్సాహం కుటుంబ సభ్యుల్లో ఉంటాయి. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ సాయంత్రం ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. మీకు ప్రయోజనాలు ఉంటాయి. చాలా కాలం తర్వాత ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులు వారి కృషి ద్వారా పూర్తి ఫలితాలు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు సమాజంలో పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తండ్రి సహకారం, మార్గదర్శకత్వం ద్వారా వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. సంతోషంగా ఉంటారు. ప్రత్యర్థులను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటా లాభం పొందుతారు. మనస్ఫూర్తిగా పనిచేస్తే విజయం మీ వెంటే ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉత్తమ సమయం గడుపుతారు. వ్యాపార వ్యక్తుల నుంచి ప్రయోజనం పొందుతారు. ఏ వ్యక్తితోనైనా లావాదేవీలు నిర్వహించవద్దు. కష్టపడి పనిచేయడం ద్వారా విజయాలు అందుకుంటారు. సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. శత్రువుల కుట్ర, ప్రజాపరాధం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు మీకు ఉంటుంది. ఫలితంగా విశ్వాసం పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు కుటుంబంలో శుభప్రదమైన పనులు, వ్యవహారాలు నిర్వహిస్తారు. సృజనాత్మకతో మీ మనస్సు తీసుకుంటుంది. చర్చల ద్వారా ఇంటి సమస్యను పరిష్కరిస్తాయి. సహాయం కూడా లభిస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కోపాన్ని నియంత్రించండి. ఆకస్మకి ప్రయోజనాలు వచ్చే అవకాశముంది. నూతన ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఉత్తమంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామి సలహా సహాయపడుతుంది. ఇది సంబంధాలను బలోపేతం చేస్తుం. ప్రేమ జీవితంలో అపార్థానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. గ్రహాల స్థానం ఆధారంగా అధికారం పెరుగుతుంది. వ్యాపార సమస్యలు మానసిక గందరగోళానికి తీస్తాయి. మీ కష్టపడి సమస్యలన్ని సద్దుమణుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు కుటుంబ ఆస్తి నుంచి అభివృద్ధి చెందుతుంది. మీకిష్టమైన వారి నుంచి మద్దతు ఉంటుంది. మీరు ఎంచుకున్న రంగంలో అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రయోజనం పొందుతారు. హానికరమైన ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. పిల్లల భవిష్యత్తు చింతలు అంతమవుతాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇంటి పనికి మీరు భయపడవద్దు. చేపట్టిన పనులు, వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆధ్యాత్మికత, ధార్మికపై ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం కొంత పనిచేస్తారు. ఇది కీర్తిని కూడా పెంచుతుంది. మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన పెట్టుబడికి సరైన సమయం కాదు. మీపై అధికారులతో విభేదాలు ఉండవచ్చు. కాబట్టి మీ పనిపై మాత్రమే దృష్టిపెట్టండి. ఉపాధి రంగంలో భారం పెరగడం వల్ల ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి సలహాతో రుణ సమస్యలు తొలగుతాయి. కుటుంబ పరిస్థితి ఒత్తిడితో కూడుకున్నది. అతిథులు ఆకస్మికంగా రావడం వల్ల ఖర్చులు పెరుగుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు సంపద పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా ప్రాపంచిక ఆనందాలను పొందుతారు. బంధువుల నుంచి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. తండ్రి సహకారంతో ప్రయోజనం పొందుతారు. మీ మాటలను, కోపాన్ని నియంత్రించుకోవాలి. లేదంటే సంబంధంలో చేదు అనుభవం ఉండవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు దుబారా ఖర్చులను నియంత్రంచండి. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అతిథి రాకతో మీకు ఆనందం కలుగుతుంది. విద్యార్థులకు ఏ పోటీ పరీక్షలనైనా పరీక్ష కాలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

click me!