today horoscope: 13 సెప్టెంబర్ 2020 ఆదివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 13, 2020, 8:08 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. మీ సంపద పెరుగుతుంది. ఈ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. దూరదృష్టితో ఆలోచించి మీరు చేసే పని ద్వారా ప్రయోజనం పొందుతారు. జీవనోపాధి రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు నేటితో ముగుస్తాయి. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ఉన్నత విద్య కోసం విద్యార్థులకు మార్గం సుగమం అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. సహోదరులకు నూతన అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మెరుగుదల కనిపిస్తుంది. కష్టపడి పనిచేయడం ద్వారా ప్రయోజనం పొందుతారు. లక్ష్య సాధన కొరకు తీవ్రంగా కష్టపడతారు. ఉపాధి కోసం మీరు చేసే శోధన ఈ రోజుతో పూర్తవుతుంది. ఇల్లు కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారంలో సానుకూల మార్పులు ఉంటాయి. మీ సంపద పెరుగుతుంది. ఈ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది. దూరదృష్టితో ఆలోచించి మీరు చేసే పని ద్వారా ప్రయోజనం పొందుతారు. జీవనోపాధి రంగంలో ఎదురయ్యే ఇబ్బందులు నేటితో ముగుస్తాయి. వివాహితులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఆహ్లాదకరమైన వార్తలు కూడా లభిస్తాయి. ప్రేమ జీవితం బలంగా ఉంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు విద్యార్థులకు కొన్ని అవరోధాలను ఎదుర్కొనే అవకాశముంది. కుటుంబ సమస్యలను సహనంతో పరిష్కరించుకుంటారు. మీ కంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యక్షేత్రంలో పని వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. ఎందులోనైనా డబ్బును పెట్టుబడిగా పెట్టాలని చూస్తుంటే ఇది సరైన సమయం. లేదనకుంటే డబ్బును ఇప్పుడున్న స్థితిలోనే ఉంచండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు కెరీర్ కు సంబంధించిన ప్రతిపాదనను ఆలోచిస్తుంటే అందుకు సంబంధించి ప్రయోజనాలు, అప్రయోజనాలను పరిగణలోకి తీసుకోండి. చాలాకాలం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉదయం నుంచే మీకు ప్రయోజనం అందుతుంది. వ్యాపారం మందగించడం వేగవంతమవుతుంది. ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టండి. వైరస్ నుంచి దూరంగా ఉండండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు జీవిత భాగస్వామికి పూర్తి మద్దతు లభిస్తుంది. వీలైనంత వరకు దుబారా ఖర్చులను నియంత్రిస్తే మంచిది. ఈ సాయంత్రం మీ ఇంటికి అనుకోని అతిథి వచ్చే అవకాశముంది. మీరు తీసుకునే రిస్క్ వల్ల మీకు ప్రయోజనం అందుతుంది. భూమి, ఆస్తి గురించి సంభాషణ ముందుకు సాగుతుంది. అంతేకాకుండా శుభవార్త అందుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు  విదేశీ సంబంధిత వ్యాపారంలో లాభం పొందుతారు. అయితే నగదు సమస్య ఉండవచ్చు. ఆధ్యాత్మికత వైపు మీ మనస్సును మళ్లిస్తారు. అంతేకాకుండా కొంచెం ఖర్చవుతుంది. మీ కీర్తి పెరుగుతుంది. మార్పు తీసుకొచ్చేందుకు ఏదైనా పర్యటనకు వెళ్లడానికి ఆలోచన చేస్తారు. చాలా రోజుల నుంచి పూర్తి చేయాల్సి ఇంటి కార్యాలు పూర్తి చేయడానికి అవకాశముంటుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకువెళ్లాలని ప్లాన్ చేసుకొని ఉండవచ్చు. అయితే అవసరమైన సమావేశాలు లేదా సెమినార్లు అంతరాయం కలిగిస్తాయి. ఆస్తి సంబంధిత వివాదాలు ముగుస్తాయి. సోదరుల నుంచి మద్దతు పొందుతారు. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంటి సభ్యుడిపై ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కూడా ముగుస్తుంది. వ్యాపారాన్ని మార్చడం సరైంది కాదు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీకు ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశముంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఇదే సమయంలో మీ జీవిత భాగస్వామి మీ పనుల్లో పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల పరోపకారం మీకు వరంగా నిరూపిస్తాయి. మీరు ఎంచుకున్న పనిలో ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో తీపి వస్తుంది. మీ స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు నూతన ఆదాయ వనరులు తెలుస్తాయి. కుటుంబంలో అనుకోని అతిథి రావచ్చు. వివాహం కావాల్సిన వారికి వీరితో సంబంధముంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అదే విధంగా తండ్రి మార్గదర్శకత్వం, మద్దతుతో వ్యాపారం వేగవంతం అవుతుంది. విద్యార్థులు రోజువారి భవిష్యత్ ప్రణాలికల కోసం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు వ్యాపారంలో నూతన ఆలోచన, ప్రయోజనం ఉంటుంది. ఇందుకోసం ముందు మీరు మిమ్మల్ని నమ్మాలి. చాలా కాలంగా స్నేహితులతో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడుతుంది. ఫలితంగా మీకు ఉపశమనంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఎంచుకున్న రంగంలో మీ కృషి మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. కోర్టు విషయంలో మీకు శుభవార్త లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలపాలపై ఆసక్తి పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు మిశ్రమఫలితాలు ఉంటాయి. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండండి. విభిన్నమైన వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి. ప్రమాదకరమైన పనులు, వ్యవహారాలు చేయకూడదు. కుటుంబ సభ్యుల మాటలను అనుసరించండి. అదేవిధంగా విద్యార్థులకు చదువులో అస్సలు అనుభూతి ఉండదు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు అనవసరమైన లావాదేవీలను వాయిదా వేయండి. మీరు లక్ష్యం వైపు పని చేస్తారు. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో అధికారుల సాయంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. ఇంట్లో పెద్దవారి జోక్యంతో కుటుంబ సమస్యలు అంతమవుతాయి. ప్రేమ జీవితంలో నూతన అనుభవాలను పొందుతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
 

click me!