today horoscope: 12 సెప్టెంబర్ 2020 శనివారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 12, 2020, 7:13 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికిి మీరు కోల్పోయిన వస్తువు తిరిగి పొందుతారు. కుటుంబంతో పాటు ఆఫీస్ బాధ్యతలను కూడా మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఫలితంగా మీకు ప్రయోజనం చేకూరుతుంది. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు ప్రజలకు సాయం చేయడంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ముందంజలో ఉంటారు. తీరిక లేకుండా గడుపుతారు. కెరీర్ గురించి కొద్దిగా ఆందోళన చెందుతారు. పనిప్రదేశంలో నూతన ప్రాజెక్టు విషయంలో సహచరుల నుంచి మద్దతు ఉంటుంది. అదే విధంగా కుటుంబంలో తోబుట్టువుల నుంచి సాయం అందుకుంటారు. దూరంగా ఉన్న మీ సన్నిహితులకు బహుమతులు ఇస్తారు. ప్రజలకు సాయం చేయడంలో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ముందంజలో ఉంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యాపారంలో నూతన భాగస్వామ్యంతో మీరు ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా మీరు ఈ రోజంతా చాలా ఆశ్చర్యాలను పొందుతారు. కుంటుంబంలో ఆనందంతో పాటు ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.  మీరు కోల్పోయిన వస్తువు తిరిగి పొందుతారు. కుటుంబంతో పాటు ఆఫీస్ బాధ్యతలను కూడా మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఫలితంగా మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఎప్పటినుంచో వేదిస్తున్న రుణాలు ఈ రోజు వసూలవుతుందని మీరు భావిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థికంగా ఈ మీకు కలిసి వస్తుంది. అయితే కొంత ఆందోళన చెందాల్సిన అవసరముంటుంది. కార్యాలయంలో చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయితే సీనియర్ల సాయంతో వాటిని సమర్థవంతంగా అధిగమిస్తారు. కీలక సమాచారాన్ని పొందుతారు. మనస్సుకు నచ్చిన వారిని కలుస్తారు. ఆస్తికి సంబంధించిన ఏదైనా పత్రంలో సంతకం చేసేముందు జాగ్రత్త వహించండి. ఆర్థికంగా ఈ మీకు కలిసి వస్తుంది. అయితే కొంత ఆందోళన చెందాల్సిన అవసరముంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు  ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సాధారణ పనిలో కొన్ని మార్పులుండవచ్చు. మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్ని పనులు ఆగిపోవచ్చు. అయితే తెలివిగా వ్యవహరిస్తే మీరకున్న పనులు పూర్తవుతాయి. ఇంట్లో యువకులుంటే వారి కెరీర్ పట్ల ఆందోళనలు మిమ్మల్ని కలవరపెడతాయి. విద్యార్థులు ప్రయోజనాలు పొందుతారు. వినోదం కోసం కొంత ఖర్చు చేస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు ఆశించే అవకాశముంటుంది. మీ సానుకూల దృక్పథం ప్రతికూల వాతావరణంలోనూ తాజాదనాన్ని నింపుతుంది. మీ ఆస్తికి సంబంధించిన విషయాలను పరిష్కరించుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది. కార్యాలయంలో కలిసి పనిచేసే వారితో వివాదాలు ఉండవచ్చు. కుటుంబం, స్నేహితుల పట్ల ఉదార వైఖరిని అవలంభిస్తారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం శుభంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు ఆర్థిక సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. చాలా సరదాగా ఉంటుంది. కార్యాలయంలో అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు ఎంచుకున్న ప్రతి పనిలోనూ కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రయత్నిస్తారు. మీరకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు వ్యాపారంలో భాగస్వాముల నుంచి నూతన ఒప్పందాలు ఉండవచ్చు. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఆరోగ్యం గందరగోళంలో పడే అవకాశముంది. కార్యాలయంలో మీ ప్రత్యర్థులను నిరుత్సాహపరచడంలో మీకు విజయం లభిస్తుంది. సమాజంలో గౌరవం పొందుతుంది. ఇందుకోసం ఏదైనా కార్యక్రమం నిర్వహించవచ్చు. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. అయితే మీ ప్రేమికుల విషయంలో రాజీపడాల్సి వస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీరు ప్రతి పనిలో తగిన జ్ఞానాన్ని ఉపయోగించి అనుకున్నది విజయంగా పూర్తి చేస్తారు. సంఘ సేవ చేయడంలో మీకు ఆనందం లభిస్తుంది. అంతేకాకుండా మీరకున్న ఉద్దేశ్యాన్ని కూడా సాధిస్తారు. కార్యాలయ వాతావరణం పని పరంగా చక్కగా ఉంటుంది. ఇంతకు ముందు కంటే మీ వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. తోబుట్టువుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. మీ కృషి వల్ల ఉన్నత హోదాలు అధిరోహిస్తారు. కార్యాలయంలో ప్రశాంత వాతావరణం కొరవడటం వల్ల మీ మనసుకు కష్టతరంగా ఉంటుంది. ఆ వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు మీరు అన్ని విధాల ప్రయత్నిస్తారు. ఇందుకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. కీలక విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.మిశ్రమ ఫలితాలుంటాయి. కార్యాలయంలో మీరు ఎంత కష్టపడితే అంత సానుకూల ఫలింతాలుంటాయి. మీ భాగస్వామితో ప్రయాణాలు సాగించే అవకాశముంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అంతేకాకుండా వ్యాపారంలో వచ్చిన నష్టాలను తీర్చుకోగలుగుతారని మీరు భావిస్తారు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు విదేశాల నుంచి కొన్ని శుభవార్తలు అందుకుంటారు. కార్యాలయంలో అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ప్రేమ జీవితానికి కొత్త అధ్యాయాన్ని కూడా జోడిస్తారు. ఎంత కృషి చేస్తే అంత ప్రయోజనం పొందుతారు. చాలా కాలంగా వాయిదా పడిన గృహ పనులపై మీరు దృష్టిపెట్టాల్సి ఉంటుంది. తండ్రి ఆరోగ్యంపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. తోబుట్టువులతో సంబంధాలు బలపడతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ పురోగతికి తోబుట్టువుల సహకారం ఉంటుంది. దీంతో పాటు మీ జ్ఞానం, అనుభవం పెరుగుతుంది. లావాదేవీలకు సంబంధించి ఈ రోజు ఎలాంటి టెన్షన్ ను తీసుకోకండి. బాగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. లేకపోతే ఆర్థిక సమతూల్యత క్షీణిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

click me!