today astrology: 10 సెప్టెంబర్ 2020 గురువారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 10, 2020, 7:16 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు కుటుంబ జీవితంలో ప్రేమ, ఆనందం కనిపిస్తుంది. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఎంతో కష్టపడి పనిచేసి అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. 



వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు, శ్రీమన్నారాయణ ఉపాసకులు, 
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

Latest Videos

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితులతో కలిసి టూర్ కు ప్లాన్ చేసుకుంటారు. ఫలితంగా మీ జీవితంలో ఆనందం లభిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రయోజనాలు, మరికొన్ని పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలు అందుకుంటారు. పని ప్రదేశంలో అధికారులతో విభేదాలు ఉండే అవకాశముంది. కోపాన్ని నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు కుటుంబ జీవితంలో ప్రేమ, ఆనందం కనిపిస్తుంది. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఎంతో కష్టపడి పనిచేసి అనుకున్న పనిలో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం సమయం పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నూతన ప్రణాళికలపై దృష్టి పెట్టవచ్చు. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు జీవిత భాగస్వామితో అనవసర చర్చలు ఉండకూడదు. సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్న వారి సమస్యలు పరిష్కారమవుతాయి. స్నేహితులు, సన్నిహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. సాయంత్రం నాటికి కొంచెం అలసట చెందుతారు. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుకున్నది చివరికి పూర్తి చేస్తారు. మీరు చేసే పనిని ఆస్వాదిస్తారు. అనుకోని అతిథులు మీ ఇంటికి వచ్చే అవకాశముంది. స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. డబ్బు లేదా బహుమతులు పొందే అవకాశముంది. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు కీర్తి పెరుగుతుంది. ఈ రోజు మొత్తం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు ఏదైనా పనిచేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మోసపోయే అవకాశముంది. శత్రువుల నుంచి మీకు సమస్యలు ఎదురుకావచ్చు. మీపై కుట్రలు చేసే అవకాశముంది. ఫలితంగా మనసు ఆందోళకరంగా ఉంటుంది. పనిలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అనుకున్న పని పూర్తి కాకపోవచ్చు. పరిచయం లేని వ్యక్తితో ఈ రోజు సంభాషణలు వద్దు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు రాజకీయంగా మద్ధతు వస్తుంది. ఆకస్మిక ప్రయోజనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కర్మల ఆధారంగా విజయం సాధిస్తారు. కుటుంబం నుంచి ఆనందం పొందుతారు. మంగళకరమైన పనలుు, వ్యవహారాలు ఈ రోజు పూర్తి చేసి విజయం సాధిస్తారు. సృజనాత్మక కార్యాల్లో ప్రయోజనం పొందుతారు. కోపం వచ్చినప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. గృహస్థులల సమస్య పరిష్కారమవుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు కుటుంబంలో వచ్చే చిరు ఇబ్బందుల వల్ల మనస్సు చికాకుగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. సానుకూల ఫలితాలున్నాయి. మీరనుకున్న లక్ష్యం నేడు పూర్తవుతుంది. అయితే చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశముంది. ప్రయాణాలను వాయిదా వేసుకునే అవకాశముంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు మీపై అధికారులతో విభేదాలు వచ్చే అవకాశముంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏమైన పనులు ఉంటే అవి కూడా పూర్తికాకపోవచ్చు. ఫలితంగా మీరు ఈ రోజు నిరాశ చెందుతారు. అనుకున్న పనులు, వ్యవహారాలు పూర్తికాకపోవడం వల్ల మీరు ఈ రోజు కొంత కలత చెందవచ్చు. నైరాశ్యంతో కూడిన ఆలోచనలకు దూరంగా ఉండండి. అకస్మాత్తుగా సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఫలితంగా కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎక్కడినుంచైనా ఈ రోజు మీకు ఆర్థికసాయం అందుకుంటారు. మతం, ఆధ్యాత్మిక లాంటి అంశాలపై విశ్వాసం పెంచుకుంటారు. రోజువారీ పనిలో చిన్నపాటి సమస్యలు ఉండే అవకాశముంది. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు  వైవాహిక జీవితంలో అన్యోన్యంగా ఉంటారు. మీ శక్తి పెరగడం వల్ల శత్రువుల శక్తి విచ్ఛిన్నమవుతుంది. అనుకోని అతిథులు రావడం వల్ల ఖర్చు పెరుగుతుంది. అయితే శుభ ఖర్చులు మీ కీర్తిని పెంచుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మీకు కొన్ని సమస్యలు ఉండే అవకాశముంది. మీపై అధికారులతో మీకు విభేదాలు తలెత్తే అవకాశముంది.కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు గ్రహాల శుభస్థానం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వాహనాలు, భూమి కొనుగోలు ఉంటుంది. ఫలితంంగా ఆనందంగా జీవనం సాగిస్తారు. గృహ సంబంధిత వస్తువులు కొనుగోలు చేసే అవకాశముంది. స్త్రీలకు ఈ రోజు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉంటే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. నిర్దిష్ట సాధనతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. అయితే వాతావరణ మార్పులు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి దీనిపై దృష్టి పెట్టడం అవసరం. అసంపూర్తిగా ఉన్న పనులు, వ్యవహారాలు ఈ రోజు పూర్తి చేస్తారు. సంతాన సంబంధిత సమస్యల పరిష్కారించడంలో సమయాన్ని గడుపుతారు. అనవసర ఖర్చులు నివారించండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

click me!