today horoscope: 08 సెప్టెంబర్ 2020 మంగళవారం రాశిఫలాలు

By telugu news team  |  First Published Sep 8, 2020, 7:11 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ రోజు వ్యవహారాలలో మీ సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. బంధువుల వైపు నుంచి సమస్యలు ఉండవచ్చు. ఇది మానసిక సంక్షోభానికి కారణమవుతుంది. కారణం లేకుండా ఖర్చులు, వివాదాలు పెరుగుతాయి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. 


వివరణ: డా. యం. ఎన్. చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు,  
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక, హైదరాబాద్. ఫోన్: 9440611151

గమనిక: ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుత కాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, మీ పేరుతో రాశిఫలాలు చూసుకోవడం వలన సరైన ఫలితాలు రావు, ఇది గమనించగలరు. కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరునోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. జై శ్రీమన్నారాయణ.

Latest Videos


మేషరాశి (Aries) వారికి :- ఈ రోజు నూతన వ్యవహారాల నుంచి ప్రయోజనం పొందుతారు. రాజకీయాల్లో గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంతానం నుంచి ఎదురైన ఆందోళనలు సద్దుమణుగుతాయి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. అంతేకాకుండా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీకిష్టమైన వారు, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు అందుకుంటారు. స్వల్ప సమస్యలు ఉంటాయి. మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృషభరాశి ( Taurus) వారికి :-  ఈ రోజు వ్యవహారాలలో మీ సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది. బంధువుల వైపు నుంచి సమస్యలు ఉండవచ్చు. ఇది మానసిక సంక్షోభానికి కారణమవుతుంది. కారణం లేకుండా ఖర్చులు, వివాదాలు పెరుగుతాయి. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండండి. సాయంత్రం కుటుంబంతో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. శుభ కార్యాలకు వ్యయం చేస్తారు. ఫలితంగా మీ కీర్తి పెరుగుతుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

మిధునరాశి ( Gemini) వారికి :- ఈ రోజు మీరు ఎంచుకున్న రంగంలో పనికి అంతరాయం ఏర్పడవచ్చు. అలాగే వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎప్పటి నుంచో వసులు కాని రుణాలు వసూలవుతాయి. ఫలితంగా ధైర్యం పెరుగుతుంది. మీకిష్టమైన వారి నుంచి వైరుధ్య పరిస్థితి తలెత్తవచ్చు. అది మీకు బాధను కలిగిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) వారికి :- ఈ రోజు నాణ్యత గల వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వ్యాపారంలో భాగస్వాములు, సేవకుల నుంచి మంచి వాతావరణం ఉంటుంది. పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. శత్రువుల మనోధైర్యం తగ్గుతుంది. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామి కోసం కొంత సమయం గడుపుతారు. సాయంత్రం వేళల్లో అతిథుల రాకతో ఖర్చు పెరుగుతుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo)  వారికి :-  ఈ రోజు వీలైనంత వరకు వివాదాలు, తగాదాలకు దూరంగా ఉంటే మంచిది. శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు. ఫలితంగా మీ కీర్తి పెరుగుతుంది. మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే వారికి మంచి ఫలితముంటుంది. మతం, ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెరుగుతుంది. శత్రువుల నుంచి ఎలాంటి చింతా ఉండదు. మీరు చేపట్టిన పని, ప్రారంభించిన వ్యవహారాలను శత్రువులు కూడా అభినందిస్తారు. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :- ఈ రోజు పురోగతి సాధించే నూతన ప్రణాళికలు మీ మనసులోకి వస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు అయినప్పటికీ చేపట్టిన వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. పని ప్రదేశంలో మానసిక ఒత్తిడితో బాధపడతారు. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.  జీవితభాగస్వామి పూర్తి మద్దతుతో ధైర్యం పెరుగుతుంది.  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

తులారాశి ( Libra) వారికి :- ఈ రోజు నూతన ప్రణాళిక గురించి భాగస్వాములతో చర్చిస్తారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే వారికిష్టమైన వారు ఆనందంగా, సుఖంగా ఉండేందుకు మద్దతు లభిస్తుంది. చేపట్టిన కొన్ని పనులు, వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అవి ఈ రోజు పూర్తవుతాయి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

వృశ్చికరాశి ( Scorpio) వారికి :- ఈ రోజు అధికారులతో పనితీరు బాగుంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే లాభం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. పిల్లల శారీరక బాధ కారణంగా మీరు కలత చెందే అవకాశముంది. బదిలీలు ద్వారా బలమైన చేర్పులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. శత్రు పక్షం మిమ్మల్ని కార్యక్షేత్రంలో ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.  

ధనుస్సురాశి  ( Sagittarius) వారికి :- ఈ రోజు మంచి వ్యక్తులతో పెరుగుతున్న పరిచయాల వల్ల అధికారులు మీ పక్షాన ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. శారీరక బలంతో పాటు ఆర్థిక బలం ఉంటుంది. ఉత్తమ మార్గాల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందుతారు. అయితే ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 
 
మకరరాశి ( Capricorn) వారికి :- ఈ రోజు సోదరులు, సన్నిహితుల, వ్యాపార సహచరుల నుంచి విడిపోయే పరిస్థితి ఉంది. ఈ కారణంగా మీకు రోజంతా అసౌకర్యంగా అనిపిస్తుంది. కోపంతో కాకుండా మాటలపై సంయనంతో ఉండాలి. వీలైనంత వరకు వివాదాలు, తగాదలకు దూరంగా ఉండటం మంచిది. లేకుంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది. సాయంత్రం సమయంలో ఆస్తి ప్రయోజనం ఉంటుంది. భార్య నుంచి మద్దతు లభిస్తుంది. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి. 

కుంభరాశి  ( Aquarius) వారికి :- ఈ రోజు కష్టపడి పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సమతూల్యంగా ఉంటుంది. వ్యాపారంలో చాలా కాలం తర్వాత నిరంతర లాభం పొందే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో భాగస్వాముల నుంచి సమస్యలు వచ్చే ప్రమాదముంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా ఇది మీ ఆరోగ్యానికి ప్రతికూలంగా మారుతుంది. వీలైనంతవరకు ఈ రోజు ముఖ్యమైన పత్రాలను తీసుకోవడం మానుకోండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

మీనరాశి ( Pices) వారికి :- ఈ రోజు మీ చుట్టూ ఉన్న సహోద్యోగుల్లో మీపై చేదు అనుభవాలు పెరగడం వల్ల ఇబ్బంది కలిగిస్తుంది. కానీ మీరు మీ పని నైపుణ్యంతో నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడిని నివారించడానికి సహనం, వినమ్రతతో పనిచేయండి. మీ ఉద్యోగాన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే పని, హక్కులు పెరుగుతాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


 

click me!