మీ చేతిలో ధన రేఖ ఉందా..?

By ramya neerukonda  |  First Published Aug 18, 2018, 1:56 PM IST

ఈ రేఖ ఎక్కడపుట్టినా దాని ముగింపు మాత్రం శనిగ్రహ పర్వత ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. నిజానికి శని క్షేత్రంలో ఒక నిలువైన స్థాయిరేఖ, ధనకారక ప్రధానమైనది.


జాతకచక్ర పరిశీలనకు కావలసిన వివరాలు సరిగా లేని జాతకులకు హస్త సాముద్రికం ద్వారా జాతకునికి సంబంధించిన జాతక వివరాలను తెలియజేయవచ్చు. చేయి చూడగానే ఎవరి దృష్టి అయినా ముందుగా చేతిలోని అన్ని రేఖలపై కాకుండా ధన రేఖపై మాత్రమే ఉంటుంది. ఆ రేఖ ఎంత ఉన్నది, పూర్వార్జితం, పిత్రార్జితం ఎమైనా ఉన్నాయా? లేదా స్వార్జితమేనా అనే విషయాలు చెప్తారు.

ధనరేఖ : ఈ రేఖ ఎక్కడపుట్టినా దాని ముగింపు మాత్రం శనిగ్రహ పర్వత ప్రాంతంలో మాత్రమే ఉంటుంది. నిజానికి శని క్షేత్రంలో ఒక నిలువైన స్థాయిరేఖ, ధనకారక ప్రధానమైనది. ఆ ధన ప్రాప్తికి ఏ గ్రహం తోడ్పడుతుంది, ఏ రేఖ తోడ్పడుతుంది అనే విషయాలు బయలుదేరు గ్రహస్థానాలు చెప్తాయి. అలాగే ఈ రేఖ నుండి బయలుదేరు వేరు వేరు శాఖలు ఆ కలిగే ధనాన్ని ఎలా అంతంతకు పెంచుకోవాలనే ఆలోచనలు ఆచరణలు ఆ శాఖలు వెళ్ళిన గ్రహ స్థానాలనుబట్టి ఉంటుంది.

Latest Videos

ఈ ధనరేఖను కర్మరేఖ, శనిరేఖ, ఐశ్వర్యరేఖ, విధిరేఖ, విత్తరేఖ, సంపద రేఖ, లక్ష్మీరేఖ, ప్రారబ్ధరేఖ, మధ్యరేఖ, ఊర్ధ్వరేఖ అని పలు పేర్లతో పిలుస్తారు.

భారతీయులు ఉదయం లేవగానే దైవిక కార్యక్రమాలు ప్రారంభించక ముందు రెండు చేతులు గమనించి కరాగ్రే వసతే లక్ష్మీ అని చెప్పే విధానాన్నిబట్టి అన్ని వ్రేళ్ళను దగ్గరగాచేర్చి చూస్తే మొదటిభాగం అనడంలో అన్నిటికి మించి పొడవుగా మొదట కన్పించేవేలు (మధ్యవేలు అయిన) శని వేలు ఐనందున దానిక్రింది ప్రాంతం శనిగ్రహ ప్రాంతమైనందున ధనము యొక్క ప్రధాన కారక నివాసం ఇలా పఠించి దీని ప్రాముఖ్యతను చెప్పారు. అలాగే ధనమూలం ఇదం జగత్‌ అని సర్వేగుణాః కాంచనమాశ్రయన్తి అనేవి ధనం యొక్క ప్రాధాన్యతను గురించి చాటుతున్నాయి. అనుభవంలో కూడా డబ్బుకు కొరత లేకున్నా జీవితంలో వచ్చే ప్రతి ఇబ్బందులను తొలగించుకోవటానికి ధనమే ప్రధానమై ఉన్నది.

ఈ రేఖ ఆస్తిపాస్తులను, పిత్రార్జిత, పూర్వార్జిత, భార్యార్జిత, శ్వశురార్జితముల గూర్చి తెలియజేస్తుంది. కొందరిలో స్థాయిరేఖ లేకున్నను ధనరేఖ లేకున్నను భయపడాల్సిన పనిలేదు. కాని తనవరకు తాను ఏనాటికానాడే సంపాదించు కుంటారని చెప్పవచ్చు. ఏదేమైనా పొదుపు అన్న ఒక మంచిగుణం ఉంటే దూరదృష్టి కలవాడని అనుకోవచ్చు.

భాగ్యరేఖ శనిపర్వతం వెళ్లినచో..........

ఈ రేఖ ముగింపు స్థానం శనిక్షేత్రం అయినందున దీనిని ధనరేఖ అని అనాలి. ఇది నిజానికి జీవితరేఖకు అత్యంత సమీపంలో బయలుదేరి శనిస్థానంలో ముగుస్తుంది. ఇది చాలామందిలో చూడగల్గుతాం. ఇట్టి జాతకులకు శనికారకాలలోని ఏ ఒకటో రెండు కారకాల ద్వారా ధనమును సంపాదిస్తారు. లోటులేని జీవితం గడుపుతారు. వీరికి పూర్వార్జితం, పిత్రార్జితం కూడా ఉంటుంది.

భాగ్యరేఖ అలలతీరు ఉండటం వల్ల లాభనష్టాలు క్రమం ఉండునని పుట్టుకతోపాయలతో ప్రారంభమైన బాద్యతలతో కూడిన ఆర్థికస్థోమత అని..భాగ్యరేఖ ముగియుచోట పాయలున్న డబ్బుపరంగా అప్పుడప్పుడు శక్తికి మించి సహాయ సహకారాలు అందించు గొప్ప ఉదారత్వం గలవారని....భాగ్యరేఖ మధ్యమధ్యన ఊర్ధ్వశాఖా రేఖలున్న ఆర్థికంగా క్రమవికాసం సాధిస్తారని ఈ విధంగా రేఖ గమన స్థానాన్ని బట్టి దాని ఫలితాలు చెప్పవలసి ఉంటుంది.
 

click me!