లగడపాటి సర్వేపై వివేక్ గరం (వీడియో)

Dec 10, 2018, 10:33 AM IST

విజయవాడ ఎంపి టికెట్ కోసమే లగడపాటి మహా కూటమికి అనుకూలంగా సర్వే రిపోర్టు ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో అర్చకులు ఆశీర్వచనం, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. గడపాటి సర్వేలతో తెలంగాణా ప్రజలను అయోమయానికి గురి చేయాలని చూశారని, కానీ తెలంగాణా ప్రజలు మరోసారి టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని వివేక్ అన్నారు.