ఈ విధంగా తను కూడా మోసం చేయవచ్చని భావించి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో తన నంబర్ కూడా పెట్టాడు. తనకు వచ్చిన నంబర్ల ద్వారా పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించాడు. ఈ విధంగా రెండేళ్ళుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడు.
గత కొంతకాలంగా గుంటూరు నగరంలో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారు. కాగా... ఆ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అయితే.... ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న వారిలో కీలక పాత్ర ఓ బీటెక్ విద్యార్థి పోషిస్తుండటం గమనార్హం.
ఇద్దరు దీనిని నిర్వహిస్తుండగా.... వారిలో కీలక పాత్రదారి నిడిగొండ వీర బ్రహ్మం బీటెక్ చదువుతున్న విద్యార్థి అని పోలీసులు చెప్పారు. హైటెక్ టెక్నాలజీ సహాయంతో.. వీరు ఈ దందా కొనసాగిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్‌లో యాప్‌ను రూపొందించి అందులో యువతుల పేర్లతో తన ఫోన్ నెంబర్ ఇచ్చి విటులను ఆకట్టుకుంటూ వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్నాడు.
నిందితులను ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా... ప్రధాన నిందితుడు వీర బ్రహ్మంకు మూడేళ్ళ వయసులోనే తల్లిదండ్రులు ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మమ్మ కూలిపని చేసి అతడిని చదివిస్తోంది. 5వ తరగతి వరకు గ్రామంలో చదివిన వీర బ్రహ్మం 6 నుంచి 10 వరకు ప్రభుత్వ హాస్టల్‌లో ఉండి చదివాడు. పాలిసెట్ పరీక్షలో ర్యాంకు సాధించి పాలిటెక్నిక్ చదివాడు. పాలిటెక్నిక్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తరువాత ఈ-సెట్‌లో 2 వేల ర్యాంకు సాధించి గుంటూరులో బీటెక్‌లో చేరాడు. ప్రస్తుతం 4వ సంవత్సరం చదువుతున్నాడు. అతడు ఓసారి ఆన్‌లైన్‌లో ఓ యాప్ ద్వారా కాల్ గరల్స్ కోసం సెర్చ్ చేశాడు.
అందులో రవి అనే వ్యక్తి పరిచయమై వీరబ్రహ్మం నుంచి ఆన్‌లైన్‌లో రూ.30 వేలు తీసుకుని హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాడు. అక్కడకు వెళ్ళగా అడ్రస్‌లో ఎవరూ లేరు. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. దీనిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదు. దీంతో ఈ విధంగా తను కూడా మోసం చేయవచ్చని భావించి ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో తన నంబర్ కూడా పెట్టాడు. తనకు వచ్చిన నంబర్ల ద్వారా పలువురు యువతులతో వ్యభిచారం నిర్వహించడం ప్రారంభించాడు. ఈ విధంగా రెండేళ్ళుగా ఈ వ్యాపారం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో వీర బ్రహ్మంకు ఇద్దరు పిల్లల తల్లి పరిచయమైంది. ఆమెతో సహజీవనం చేస్తూ వారి పోషణ కూడా తానే చూస్తున్నాడు. అదే సమయంలో థామస్ కుమార్ కూడా ఈ విధంగానే వీరబ్రహ్మంకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి పాతగుంటూరులోని నంది వెలుగు రోడ్డులో గది అద్దెకు తీసుకుని దందా సాగిస్తున్నారు. గదికి మహిళలు, యువకులు వచ్చి వెళ్తుండడంతో అనుమానించిన స్థానికులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.