ఎంత కట్టడిచేసినా వ్యభిచారం అదుపులోకి రావడం లేదు. ఏదో రకంగా మహిళల శరీరాలతో వ్యాపారం చేసే ముఠాలు తమ పని కానిచ్చేస్తూనే ఉన్నాయి. తాజాగా పొన్నూరులో ఓ బ్రోతల్ హౌన్ మీద పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
పొన్నూరు : Ponnur పరిధిలోని కట్టెంపూడి అడ్డా రోడ్డులోని ఒక గృహంలో Prostitution నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండల పరిధిలోని కట్టెమ పూడి అడ్డరోడ్డు సమీపాన దేవరకొండ లక్ష్మి అను మహిళ ఒక ఇంటిని Rentకు తీసుకొని దాంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు రూరల్ ఎస్ఐ భాగ్యరాజుకి సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ ఇంట్లో విటుడు సురేష్,పెద్దిరెడ్డి రజిని, లక్ష్మీలను ఎస్సై అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10 వేలు రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాగ్యరాజు తెలిపారు.
కాగా, తెలంగాణలోని హైదరాబాద్ లో హైదరాబాద్ లో క్రైం అనేక రూపాల్లో జరుగుతోంది. Saloon ముసుగులో నిర్వహిస్తున్న Massage Centerపై SOTపోలీసులు దాడులు జరిపి నిర్వాహకులను అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాధిక చౌరస్తా సమీపంలో నిర్వహిస్తున్నసెలూన్ అండ్ స్పాలో అమాయక మహిళలను మభ్యపెట్టి వారితో మసాజ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు.. ఆకస్మిక దాడులు జరిపి.. నిర్వాహకులు శివసాయి నగర్ కాలనీకి చెందిన జంపాల శివ, ఈస్ట్ మారేడ్పల్లికి చెందిన కొలిపాక రవి, ఓ విటుడితో పాటు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మార్చి 29న దేశ రాజధానిలోని Indira Gandhi International Airport సమీపంలోని హోటల్స్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న Prostitution దందాను ఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ ఘటనలో దందా నడిపిస్తున్న సూత్రధారి, ఒక అమ్మాయితో పాటు ముగ్గురిని arrest చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మార్చి 21న ఏరోసిటీ పరిసర ప్రాంతాల్లోని హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంపై attckలు చేసేందుకు పోలీసు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. పోలీసుల బృందం ఏరోసిటీ ప్రాంతానికి చేరుకుంది. ఈ దందా నడుపుతున్న వ్యక్తి దగ్గరికి పోలీసులు తమ రహస్య Informer ద్వారా సంప్రదించారు.
ప్లాన్ ప్రకారం హోటల్ హాలిడే ఇన్ లో ఒక గదిని కూడా బుక్ చేశారు. ఇన్ఫార్మర్ వేచి ఉన్న హోటల్ కు సూత్రధారి ఓ అమ్మాయిని తీసుకుని వచ్చి హోటల్ వరండాలో దించి అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత హోటల్లో గదికి యువతి చేరుకోగానే కస్టమర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఆ పరిసరాల్లోనే ఉన్న బృందం యువతిని, ఆమెను డ్రాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూత్రధారి నవీన్ గా గుర్తించారు. అతనిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.