గుంటూరు గ్యాంగ్‌రేప్: వెలుగులోకి కొత్త విషయాలు, మరో ముగ్గురు పేర్లు తెరపైకి

By narsimha lodeFirst Published Jun 23, 2021, 9:36 AM IST
Highlights

 గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల విచారణలో  కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కరఘాట్ వద్ద యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసుల విచారణలో  కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

also read:గుంటూరు‌ గ్యాంగ్‌రేప్ కేసులో పురోగతి: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

ఐదు రోజుల క్రితం తనకు కాబోయే భర్తతో వెళ్లిన యువతిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడిని కట్టేసి అతడి ముందే నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కృష్ణ, వెంకట్ రెడ్డి అనే ఇద్దరు నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఈ ఇద్దరు నిందితులకు గోపితేజ,  సురేష్,  అయ్యప్పలు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.   పోలీసుల విచారణలో ఉన్న నిందితులు కొత్త పేర్లు .పోలీసులకు వివరించినట్టుగా తెలుస్తోంది. బాధితుల నుండి తీసుకెళ్లిన రెండు సెల్‌ఫోన్లను దాస్ అనే వ్యక్తి వద్ద నిందితులు తాకట్టు పెట్టారు. ఈ ఫోన్ల ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు నిందితులు ఇచ్చిన  సమాచారం ఆధారంగా మరో  ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  నిందితుల కోసం పోలీసులు ఆరు టీమ్‌లతో దర్యాప్తు చేస్తున్నారు. 


 

click me!