ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయడం ఏపీకే అవమానమని టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ఇవాళ బాధితురాలిని చంద్రబాబు పరామర్శించారు.
విజయవాడ: ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానమని TDP చీఫ్ Chandrababu Naidu డిమాండ్ చేశారు.Vijayawada ప్రభుత్వాసుపత్రిలో యువతిపై Gang Rape బాధితురాలిని పరామర్శించిన తర్వాత చంద్రబాబు శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను సిగ్గుపడుతున్నానని చంద్రబాబు చెప్పారు.
సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువతిని పరామర్శించడానికి ఆసుపత్రికి రాకుండా మోసపూరిత సున్నా వడ్డీ పథకం నిధుల విడుదలంటూ ఒంగోలు పోయాడన్నారు. ముఖ్యమంత్రి YS Jagan బాధ్యత లేకుండా వ్యవహరించటం వల్లే ఈ అఘాయిత్యాలు చోటు చేసుకొంటున్నాయని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు.
undefined
రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని చంద్రబాబు అన్నారు. ఒంగోలులో ప్రయాణికుల పట్ల పోలీసుల తీరును ఖండిస్తున్నామన్నారు.తిరుపతికి వెళ్లే కుటుంబం నుండి వాహనాన్ని సీఎం కాన్వాయ్ కోసం తీసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై వాహనం పాడైందని రిపేర్ చేసేందుకు తీసుకెళ్లినట్టుగా మాట మారుస్తున్నారన్నారు.
ప్రజల ఆస్తులకు, మహిళలకు ఏపీలో రక్షణ లేదన్నారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలతో సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోతున్నారన్నారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధితురాలికి రూ.కోటి ఆర్థికసాయం చేసి, ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యాచార బాధితురాలికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చంద్రబాబు విమర్శించారు. బాధితురాలికి చంద్రబాబు నాయుడు రూ. 5 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించారు.
ఈ ప్రభుత్వానిది అహంకారమా, ఉన్మాదమా అని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోతారని ఆయన జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తన చెంచాలతో సీఎం మాట్లాడిస్తే భయపడిపోనన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. మనల్ని మనం కాపాడుకొనేందుకు పోరాటం చేయాలన్నారు.
బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. తప్పిపోయిన కూతురిని వెతుక్కోవాలని పోలీసులు చెప్పడాన్ని చంద్రబాబు తప్పు బట్టారు. బాధిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురికి ఉరిశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.బాధితురాలిని సీఎం జగన్ పరామర్శించాలన్నారు.బాధితురాలికి కోటి రూపాయాలు ఇవ్వాలన్నారు. బాధితురాలికి ుద్యోగం ఇచ్చి ఆదుకోవాలని చంద్రబాబు కోరారు.