విడాకులివ్వకపోతే, నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో పెడతా.. భార్యను వేధిస్తున్న భర్త !

By AN Telugu  |  First Published Dec 29, 2020, 1:29 PM IST

సొంత భార్య నగ్నచిత్రాలనే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ఓ భర్త దారుణ ఉదంతం గుంటూరులో వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తెమ్మంటే తేవడం లేదంటూ భార్యను విడాకులు కోరిన సదరు భర్త, విడాకులు ఇవ్వకుంటే భార్య నగ్నచిత్రాలు ఇంటర్నెట్ లో పెడతానని వేధిస్తున్నాడు.


సొంత భార్య నగ్నచిత్రాలనే ఇంటర్నెట్ లో పెడతానని బెదిరిస్తున్న ఓ భర్త దారుణ ఉదంతం గుంటూరులో వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తెమ్మంటే తేవడం లేదంటూ భార్యను విడాకులు కోరిన సదరు భర్త, విడాకులు ఇవ్వకుంటే భార్య నగ్నచిత్రాలు ఇంటర్నెట్ లో పెడతానని వేధిస్తున్నాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెడితే..  ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతికి గుంటూరు జిల్లాలోని ఓ వ్యక్తితో 2016లో వివాహమైంది. కట్నం కింద లక్ష రూపాయలు, 5 సవర్ల బంగారం, సామాన్లు, రూ.10 లక్షలు ఖరీదు చేసే ఇంటి స్థలం రాసిచ్చారు. పెళ్లి తరువాత తొలిచూలులో ఆ యువతికి పాప పుట్టింది. అప్పటినుంచి భర్త, అత్త, మామ, ఆడపడుచుల నుంచి అదనపు కట్నం తేవాలని వేధింపులు మొదలయ్యాయి.

Latest Videos

దీనిపై 2018లో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండగా 2019లో భరణం కేసు వేయగా అది పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఆ భర్త కొద్ది రోజులుగా భార్య సమీప బంధువుకి ఫోన్‌ చేశాడు.భార్య ఫోన్‌ ట్యాప్‌ చేసి రికార్డు చేసినట్లు, వాటిల్లో కొన్నింటిని ఆ మహిళ వాట్సాప్‌కు పంపాడు. ఈ విషయం సదరు మహిళ భార్యకు తెలిపింది. 

ఈ క్రమంలోనే గతంలో తాను స్నానం చేస్తుండగా రహస్యంగా ఫొటోలు, వీడియో తీశానని భర్త ఆమెకు చెప్పినట్లు బాధితురాలు పేర్కొంది.భర్తకి విడాకులు ఇవ్వకపోతే నగ్న చిత్రాలు ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని వాపోయింది. 

తెలిసిన వ్యక్తుల సహయంతో రెండు సెల్‌ కంపెనీల ప్రతినిధుల సహాయంతో ఫోన్‌ ట్యాప్‌ చేసినట్లు తెలిసిందని పేర్కొంది. భర్తపై, అతనికి సహకరించిన ఆడపడుచు, సెల్‌ కంపెనీల ప్రతినిధులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె పోలీసులతో మొరపెట్టుకుంది. 

click me!