ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం చేసుకున్నాడు. ఆ మహిళ హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా తాను అక్కడికి వెళ్ళి తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళా ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగింది గుంటూరులో కాబట్టి... కొత్తపేట పోలీసులకు బదిలీ చేశారు. శుక్రవారం కొత్తపేట సిఐ శ్రీనివాసులు రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మహిళను అదే ప్రాంతానికి చెందిన బ్రహ్మయ్య పరిచయం చేసుకున్నాడు. ఆ మహిళ హైదరాబాదులో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా తాను అక్కడికి వెళ్ళి తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు.
ఈ క్రమంలో 2021 జూలై 11న ఆమెను ఉద్యోగ విషయం మాట్లాడదామని గుంటూరు తీసుకువచ్చాడు. రైలుపేటలోని ఓ లాడ్జికి తీసుకు వచ్చి కొంత సేపు విశ్రాంతి తీసుకుందాం అన్నాడు. లాడ్జిలో ఆమె విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అత్యాచారం చేశాడు. ఆ తరువాత నగ్న వీడియోలు తీసినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెప్పినా, తాను రమ్మని పిలిచినప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికీ చూపిస్తానని బెదిరించినట్లు పేర్కొంది.
అప్పటి నుంచి ఆ వీడియోలతో బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు కేసును గుంటూరు కొత్తపేటకు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.