గుంటూరులో దారుణం: బాయ్‌ఫ్రెండ్‌కి అస్వస్థతంటూ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

By narsimha lode  |  First Published May 19, 2022, 10:07 AM IST

iగుంటూరు జిల్లాలోని నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


గుంటూరు: జిల్లాలోని Nallapadu పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై ముగ్గురు Gang Rape పాల్పడ్డారు. వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం Police గాలింపు చర్యలు చేపట్టారు. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా పోలీసులు గుర్తించారు. Guntur జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామానికి చెందిన బాలిక సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడితో Love వ్యవహరం సాగుతుంది.  ఈ విషయాన్ని గుర్తించిన  ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు Girlను నమ్మించి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

also read:బీహార్ లో దారుణం.. పాట పాడేందుకు పిలిచి.. సింగ‌ర్ పై సామూహిక అత్యాచారం

Latest Videos

  బాయ్‌ఫ్రెండ్  స్పృహ తప్పి పడిపోయాడని  బాలికకు ఫోన్ చేసి  చెప్పారు. ఈ విషయం నమ్మిన బాలిక ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన చోటుకు చేరుకుంది. వారిని నమ్మి అతడి బైక్ పై వెళ్లింది. ఇన్నర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని Lodge లో బాధితురాలి బోయ్ ఫ్రెండ్ స్పృహ తప్పి ఉన్నాడని నమ్మించి అక్కడికి తీసుకెళ్లారు. ఆ బాలికను అక్కడికి తీసుకెళ్లిన తర్వాత బాలికకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చారు. మత్తులో జారుకున్న తర్వాత బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు.

రాత్రిపూట నీరసంగా బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులను బాలికను నిలదీస్తే ఆమె అసలు విషయం చెప్పింది. బాలికను తీసుకొని పేరేంట్స్ గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా ముగ్గురు నిందితులను గుర్తించారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరి కోసం గాలింపు చేపట్టారు. ఈ ముగ్గురు కూడు గుంటూరుకి సమీపంలోని ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ గా పోలీసులు గుర్తించారు.

బాలికపై అత్యాచారానికి పాాల్పడిన వారిలో ప్రియుడు ఉన్నాడా  లేదా అనే విషయమై కూడా పోొలీసులు ఆరా తీస్తున్నారు. బాలికను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

ఇటీవల కాలంలో  గుంటూరు జిల్లాలో మహిళలపై  రేప్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  ఏప్రిల్ మాసంలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున మహిళలపై రేప్ ఘటనలు చోటు చేసుకోవడంపై విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఇదిలావుంటే పల్నాడు జిల్లా గురుజాల రైల్వేస్టేషన్లో ఇలాగే వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. మూడేళ్ల కొడుకుతో ఒంటరిగా వున్న ఒడిషా మహిళపై గుర్తుతెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అతి దారుణంగా లైంగికదాడికి పాల్పడటంతో అపస్మారక స్థితిలో పడివున్న మహిళను గుర్తించిన కొందరు హాస్పిటల్ కు తరలించారు. 

 ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.

ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. 


 

click me!