రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాల లక్ష్యం భారీగా పెంచిన ప్రభుత్వం

Published : Jul 09, 2024, 02:48 PM IST
రైతులకు గుడ్ న్యూస్.. వ్యవసాయ రుణాల లక్ష్యం భారీగా పెంచిన ప్రభుత్వం

సారాంశం

వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2లక్షల 31వేల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 90శాతం అంటే రూ.2లక్షల 8వేల 136 కోట్ల రుణాలు మంజూరు చేశారు. 

వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో మంగళవారం 227వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవిఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుకు స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ శుభాకాంక్షలు తెలియజేసింది. 

అనంతరం ఐదు ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 
1. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడం, కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించడం, మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవడం
2. P-4 మోడల్ (పీపుల్, పబ్లిక్, ప్రెవేట్ పార్టనర్ షిప్) ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన ప్రాజెక్టులు, ప్రణాళిక చేపట్టడం.
3. డిజిటల్ లావాదేవీల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడం
4. స్కిల్ డెవలప్‌మెంట్‌కు చర్యలు తీసుకోవడం. 
5.సంపద సృష్టించే, జీఎస్‌డీపీ పెంచే రంగాలకు తగు ప్రోత్సాహం ఇవ్వడంపై మంత్రులు, బ్యాంకర్లు, ఆయా రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశారు.

అలాగే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ల్‌బీసీ) సమావేశం విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5లక్షల 40వేల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల చేశారు. ఇందులో ప్రాధాన్య రంగాలకు రూ.3లక్షల 75వేల కోట్లు, ఇతర రంగాలకు రూ.లక్షా 65వేల కోట్లు కేటాయించారు. 

ప్రధానంగా వ్యవసాయ రంగానికి రూ.2లక్షల 64వేల కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గతం కంటే 14 శాతం అధికం.
 
డైరీ, ఫౌల్ట్రీ, ఫిషరీస్, వ్యవసాయ యాంత్రీకరణకు, వ్యవసాయం రంగంలో మౌళిక సదుపాయాలకు రూ.32వేల 600 కోట్లతో రుణ ప్రాణాళిక సిద్ధం చేశారు. 

2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రాధాన్యతా రంగానికి రూ.3లక్షల 23వేల కోట్లు లక్ష్యంగా నిర్దేశించగా... ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,75,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంతో పోల్చితే ఇది 16 శాతం అధికం రుణాల లక్ష్యం. 

వ్యవసాయ రంగానికి గత సంవత్సరం రూ.2లక్షల 31వేల కోట్లు రుణ లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 90శాతం అంటే రూ.2లక్షల 8వేల 136 కోట్ల రుణాలు మంజూరు చేశారు. 

ఉద్యోగ, ఉపాధి కల్పనకు దోహదపడే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (MSME) రంగానికి 2023-24 ఏడాదిలో రూ.69వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా... ఈ ఏడాది ఏకంగా రూ.87,000 కోట్లు లక్ష్యం పెంచారు. అంటే 26 శాతం అధికంగా రుణాలు ఇవ్వాలని ప్రణాళిక. 

అలాగే, రూ.11వేల 500 కోట్లు రుణాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన బ్యాంకర్ల కమిటీ... సాంప్రదాయేతర ఇంధన రంగానికి రూ.8వేల కోట్లు రుణ ప్రాణాళిక సిద్దం చేసింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu