విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉడా కాలనీలో మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది
విజయనగరం: Vizianagaram జిల్లాలో దారుణం చోటు చేసుకొంది. Womanపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు Policeలకు పిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.విజయనగరం పట్టణంలోని ఉడా కాలనీలో బాధితురాలిపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్టుగా సమాచారం.
బాధిత మహిళ మన్యం జిల్లా సీతానగరం గ్రామానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు.బాధితురాలు విజయనగరంలో టీ దుకాణంలో పనిచేస్తుంది. సోమవారం నాడు రాత్రి ఇద్దరు వ్యక్తులు బాధితురాలి ఇంటి తలుపు తట్టారు. ఇంట్లోకి వచ్చిన ఇద్దరు నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
undefined
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా చోటు చేసుకొంటున్నాయి. రేపల్లే రైల్వే స్టేషన్ లో వివాహితపై గ్యాంగ్ రేప్ ఘటన కలకలం చోటు చేసుకొంది. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను 24 గంటల్లోపుగానే పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ లోరనే ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.
Prakasam జిల్లా Yerragondapalem మండలం వెంకటాద్రిపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం పనుల కోసం కృష్ణా జిల్లా నాగాయలంకకు వెళ్లేందుకు బాపట్ల జిల్లా రేపల్లెకు వచ్చారు. శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్ లోనే ఉన్నారు. ఉదయాన్నే వీరు కృష్ణా జిల్లాకు వెళ్లాలని భావించారు. రాత్రిపూట రేపల్లే రైల్వే స్టేషన్ ఒకటో నెంబర్ ఫ్లాట్ ఫాంపై పడుకొన్నారు. ఆదివారం నాాడు తెల్లవారుజామున భర్తను చితకబాదిన ముగ్గరు దుర్మార్గులు రైల్వే స్టేషన్ లోనే వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారని పోలీసులు గుర్తించారు.
తన కళ్లెదుటే భార్యపై అఘాయిత్యం జరుపుతుంటే ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో భర్త వుండిపోయాడు. రైల్వే స్టేషన్ లోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి తలుపుతట్టినప్పటికి ఎవ్వరూ స్పందించలేరని బాధిత మహిళ భర్త తెలిపారు. దీంతో భార్యాపిల్లలను రైల్వే స్టేషన్లోనే వదిలి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు పరుగున వెళ్ళి ఫిర్యాదు చేశారు.
రేపల్లే గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది. బాధితురాలిని ఏపీ హోం మంత్రి తానేటి వనిత మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు పరామర్శించారు.
ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని శృంగారపురం గ్రామానికి ఇతర ప్రాంతాల నుండి కూలీపనుల కోసం వచ్చిన ఓ మహిళ ఆలయంలో నిద్రిస్తుండగా కొందరు యువకులు అఘాయిత్యానికి యత్నించారు. నిద్రిస్తున్న మహిళను దగ్గర్లోని తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ప్రయత్నించగా ఆమె గట్టిగా అరిచింది. దీంతో భయపడిపోయిన యువకులు పరారయ్యారు. యువతి కుటుంబసభ్యుల పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకులను అరెస్ట్ చేశారు.
ఇక తుమ్మపూడిలో వివాహిత హత్య సంచలనం సృష్టించింది. మహిళపై అత్యాచారం జరిపి హత్య చేసినట్లు ప్రచారం జరగ్గా గుంటూరు ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టాడు. మహిళపై అత్యాచారం జరగలేదని... ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన హత్యగా గుంటూరు అర్భన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు.