ఆ పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగవాళ్లు ఏడుస్తారని టీడీపీపై ఏపీ మంత్రి విమర్శలు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రపై ఆమె మండిపడ్డారు.
ఒంగోలు: ఆ పార్టీలో ఆడవాళ్లు తొడలు కొడతారు, మగవాళ్లు ఏడుస్తారని టీడీపీపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు.ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ క్రీడా కేంద్రాన్ని ఏపీ మంత్రి ఆర్ కే రోజా సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రోజా ప్రసంగించారు.
రైతులు వాకీటాకీలు పట్టుకోవడం చూశారా అని అమె అడిగారు. అమరావతి నుండి అరసవెల్లి వరకు అమరావతి రైతులు పాదయాత్ర చేయడంపై కూడా విమర్శలు చేశారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ది చేయడం కోసమే సీఎం జగన్ మూడు రాజధానులను తీసుకు వచ్చారన్నారు. అభివృద్ది ఒకే ప్రాంతానికి పరిమితమైతే ఇబ్బందులు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.
undefined
రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు.29 గ్రామాల కోసం 26 జిల్లాల అభివృద్దిని ఆపాలని సీఎం అనుకోవడం లేదన్నారు. రాజధానితో ప్రతి నియోజకవర్గం అభివృద్ది చెందాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రోజా హమీ ఇచ్చారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ క్రీడా వికాస కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. pic.twitter.com/4R63NyT8m9
— Roja Selvamani (@RojaSelvamaniRK)అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో రైతులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అమరావతి రైతుల ఆందోళనలు వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాయి. దీంతో ఈ నెల 12వ తేదీ నుండి అమరావతి రైతులు పాదయాత్రను ప్రారంభించారు. ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో రైతుల పాదయాత్రను ప్రారంభించారు. అరసవెల్లిలో పాదయాత్రను ముగించనున్నారు. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని అరసవెల్లిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.
also read:మూడు రాజధానులతో నష్టమేంటీ?: అమరావతి రైతులను ప్రశ్నించిన మంత్రి బొత్స
మూడు రాజధానులకు మద్దతుగా ప్రజల నుండి మద్దతును కూడగట్టే ప్రయత్నాన్ని వైసీపీ చేస్తుంది. మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్టణంలో నిన్న వైసీపీ రౌండ్ టేబుల్ నిర్వహించింది. అమరావతి రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గతంలో విమర్శించిన విషయం తెలిసిందే.