సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటిలో ముగ్గురు మంత్రులున్నారు.CPS News
అమరావతి: CPS రద్దుపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు మంత్రులున్నారు.
ఈ కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. గతంలో ఏర్పాటు చేసిన కమిటీలో అదనంగా ఇద్దరు సభ్యులను చేర్చుతున్నట్టుగా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
undefined
సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ తో ఇవాళ UTF సీఎం ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చింది. అయితే యూటీఎఫ్ కార్యాలయంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి సోమవారం నాడు సాయంత్రం సచివాలయంలో Employees Association నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ చర్చలు జరుపుతున్న సమయంలోనే సీపీఎస్ రద్దు అంశానికి సంబంధించి ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు కమిటీని ప్రభుత్వం ప్రకటించింది.
సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌పై ఉద్యోగ సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు తాము అధికారంలోకి వస్తే సీపీఎస్ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేస్తామని చెబుతున్నారు. ఉద్యోగ సంఘాలు ఈ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి.
సీపీఎస్ పెన్షన్ స్కీమ్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 2003 చివర్లో అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం ఈ పధకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ స్కీమ్ ను 2004లో అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం అమలు చేసింది.
సీపీఎస్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి రాకముందు ఉద్యోగుల జీతాల నుండి పెన్షన్ కోసం పైసా కూడ కట్ చేసేవారు కాదు. కానీ, కొత్త స్కీమ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతీ ఉద్యోగి జీతం నుండి కనీసం 10 శాతాన్ని పెన్షన్ స్కీమ్ కోసం కట్ చేస్తున్నారు.
ఉద్యోగుల వేతనాల నుండి కట్ చేసిన నిధులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. అయితే షేర్ మార్కెట్లలో పెట్టుబడులన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి వెళ్తాయని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయంతో ఉన్నారు. పాత పెన్షన్ స్కీమ్ లో అయితే పెన్షన్ కోసం ఒక్క పైసా కూడ ఉద్యోగి వేతనం కూడ కట్ చేసేవారు కాదు.
పాత పెన్షన్ స్కీమ్ పద్దతిలోనే ఉద్యోగులు ప్రయోజనం పొందేవారని ఉద్యోగ సంఘాలు అభిప్రాయంతో ఉన్నాయి. ఉద్యోగి బేసిక్ వేతనంలో 7 ఏళ్ళ పాటు సగం జీతాన్ని పెన్షన్ రూపంలో చెల్లించేవారు. ఆ తర్వాత 30 శాతం పెన్షన్ గా చెల్లించేవారు.
కానీ సీపీఎస్ విధానం ద్వారా ఉద్యోగులకు పెన్షన్ అతి తక్కువగా పొందే అవకాశం ఉంది. అతి తక్కువ మొత్తాన్ని ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ గా పొందనున్నారని ఉద్యోగ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.
సీపీఎస్ పెన్షన్ స్కీమ్ సంబంధించిన విషయమై 2013 వరకు చట్టం కాలేదు. 2004లో యూపీఏ తొలిసారిగా అధికారంలో ఉన్న కాలంలో వామపక్షాలకు పార్లమెంట్ లో గణనీయంగా ఎంపీలు ఉన్నారు. 2009 ఎన్నికల్లో ఆ పార్టీలకు ఎంపీల సంఖ్య తగ్గింది. వామపక్షాలు సంఖ్య తగ్గడంతో 2013 అక్టోబర్ మాసంలో ఈ స్కీమ్ ను చట్టంగా మారింది.
పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ యాక్ట్ కు 2013 ఆగష్టులో చట్టం అయింది. కాంగ్రెస్ కు ఆనాడు బిజెపి మద్దతుగా నిలిచింది. ఈ లోక్‌సభలో ఓటు చేసింది చట్టరూపంగామార్చింది.అయితే ఈ చట్టంలో చేరడానికి ఆసక్తి ఉన్న రాష్ట్రాలు చేరవచ్చని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. సీపీఎస్ ను రద్దు చేస్తామని జగన్ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. దీంతో ఈ హమీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.